Nadigar Sangam Meet CM MK Stalin.
నడిగర్ సంఘం ఎన్నికల్లో రెండో సారి జయకేతనం ఎగురవేసింది పాండవర్ బృందం. 2019లో జరిగిన ఎన్నికల ఫలితాలను ప్రకటించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆదివారం ఓట్ల లెక్కింపు జరిపి, విజేతలను ప్రకటించారు. దాంతో కొత్తగా నడిగర్ సంఘానికి ఎన్నికైన అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ తదితరులు మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
ఈ ఎన్నికల్లో స్టాలిన్ తనయుడు ఉదయనిధి సైతం నాజర్ వర్గానికే మద్దత్తు పలికాడు. ‘రెండవ విడత నడిగర్ సంఘం బాధ్యతలు స్వీకరించే ముందు ప్రియతమ ముఖ్యమంత్రి ఆశీస్సులు తీసుకున్నామ’ని విశాల్ ట్వీట్ చేశాడు. నిజానికి విశాల్ బృందం మొదటిసారి పోటీ చేసినప్పుడు ఉన్నంత టఫ్ ఫైట్ ఈసారి లేదనే చెప్పాలి. అయితే ఎన్నికలు జరిగిన విధానాన్ని ప్రశ్నిస్తూ పలువురు నటీనటులు కోర్టుకు వెళ్లడంతో ఫలితాల లెక్కింపులో జాప్యం జరిగింది.