భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం నేపథ్యంలో ‘ది తాష్కెంట్ ఫైల్స్’ మూవీని తెరకెక్కించిన వివేక్ రంజన్ అగ్రిహోత్రి, ఆ తర్వాత కశ్మీర్ నుండి గెంటివేయబడ్డ పండిట్స్ ఉదంతాలతో ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీని తెరకెక్కించాడు. చిన్న చిత్రంగా విడుదలైన ఇది మూడు నాలుగు వారాల్లోనే రూ.250 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, పోస్ట్ పేండమిక్ సీజన్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాంతో అదే ఊపుతో వివేక్ అగ్నిహోత్రి, ఇందిరా గాంధీ మరణానంతరం ఢిల్లీలో సిక్కుల ఊచకోత నేపథ్యంలో ‘ది ఢిల్లీ ఫైల్స్’ మూవీని రూపొందించ బోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి వచ్చింది. ‘ది కశ్మిర్ ఫైల్స్’ను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐ యామ్ బుద్ధ సంస్థలే దీన్ని నిర్మిస్తున్నాయి. హిందీతో పాటు పంజాబీలోనూ రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా ఇదే యేడాది అక్టోబర్ లో జనం ముందుకు రానున్నది.