బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అంటే రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి మాత్రమే. అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ జంట ముందుగా 14వ తేదీన పెళ్ళాడనున్నట్లు వార్తలు వినవచ్చాయి. అయితే ఈ పెళ్ళి వాయిదా పడబోతున్నట్లు ఫీలర్స్ అందుతున్నాయి. దానికి కారణం భద్రతాపరమైన ఆందోళన అని వినిపిస్తోంది. నిజానికి పెళ్ళి విషయం లీక్ కాగానే భద్రతపై దృష్టిసారించారు. ఇప్పుడు అదే కారణంతో వాయిదా కూడా వేస్తున్నారట. మరోవైపు ఈ పెళ్ళి వచ్చేవారానికి […]
‘బాహుబలి – ద బిగినింగ్’ తరువాత ‘బాహుబలి- ద కంక్లూజన్’కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ స్థాయిలో కాకపోయినా, ఇప్పుడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్, యశ్ హీరోగా తెరకెక్కించిన ‘కే.జి.ఎఫ్.- ఛాప్టర్ 2’ కు మొదటి భాగం గ్రాండ్ సక్సెస్ తో మంచి క్రేజ్ ఏర్పడిందనే చెప్పాలి. ఈ సినిమా వస్తోందని తెలిసి, ఉత్తరాదిన సైతం కొన్ని డైరెక్ట్ గా రూపొందిన హిందీ చిత్రాలు పక్కకు తప్పుకున్నాయి. దీనిని బట్టే, ‘కేజీఎఫ్-2’కు ఎంత […]
తెలుగు ఇండియన్ ఐడిల్ కాంపిటీషన్ రౌండ్ ఇప్పుడు జరుగుతోంది. 12 మంది కంటెస్టెంట్స్ కు ఛాన్స్ ఇచ్చిన న్యాయనిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తిక్… ఈ షో నుండి మొదటగా పంజాబ్ కు చెందిన సింగర్ జస్కరన్ ను ఎలిమినేట్ చేశారు. అయితే ఆ తర్వాత వీకెండ్ మాత్రం ఎలాంటి ఎలిమినేషన్స్ లేకుండా ఎపిసోడ్ సాగింది. నిత్యామీనన్, కార్తిక్, తమన్ కు సంబంధించిన సాంగ్స్ శుక్రవారం పాడగా, శనివారం ఈ షోకు గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్ […]
ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు ఐదారు సినిమాల్లో నటిస్తున్నాడు. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే… చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ నటిస్తున్న ‘కార్తికేయ -2’ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు నిర్మాతలు. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ సక్సెస్ ను సొంతం చేసుకుంటున్న క్రేజీ ప్రొడక్షన్ హౌసెస్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ […]
‘ఆర్ఆర్ఆర్’ సందడి సద్దుమణుగుతోంది. ‘కెజిఎఫ్-2’ హీట్ మొదలైంది. ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయబోతోంది. ఇక దీనికి పోటీగా ఓ రోజు ముందు ‘బీస్ట్’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల్లో దేనికి ఆదరణ దక్కుతుందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్. వరుస విజయాలతో కోలీవుడ్ సూపర్ స్టార్ గా కొనసాగుగున్న విజయ్ ‘బీస్ట్’లో హీరో కాగా, లక్కీ బ్యూటీ కన్నడ కస్తూరి పూజా హెగ్డే కథానాయిక. నెల్సన్ దిలీప్ కుమార్ […]
తెలుగు ఇండియన్ ఐడిల్ 14వ ఎపిసోడ్ సైతం సరదా సరదాగా సాగిపోయింది. శుక్రవారం తమన్, నిత్యామీనన్, కార్తీక్ సినిమాలకు సంబంధించిన పాటలు పాడిన కంటెస్టెంట్స్… శనివారంఈ ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చిన వరుణ్ తేజ్ మూవీ సాంగ్స్ పాడి అలరించారు. మొదటగా వచ్చిన శ్రీనివాస్ ధరిమిశెట్టి ‘తొలిప్రేమ’లోని ‘నింగిలా నిన్నిలా చూశానే’ పాటతో బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని వోకల్ కార్డ్స్ కు ఏమైనా అయిపోతుందేమోననే భయం వేస్తోందని, అద్భుతమైన పిచ్ లో […]
దక్షిణాది అగ్రహీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. అమ్మడి కోసం ప్రముఖ నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. పూజ ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో దిల్ రాజు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక పూజహేగ్డే కూడా తనకు అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ హీరోయిన్ పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ వస్తోంది. రాబోయే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో చిన్న పాత్రలో కూడా కనిపించనుంది. […]
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటజీవితంలో మరపురాని చిత్రాలెన్నో! వాటిలో 1962 ఏప్రిల్ 11న విడుదలైన ‘మంచి మనసులు’ మరపురానిది. అంతకు ముందు తమ అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై నిర్మితమైన చిత్రాలలో అక్కినేని, ఆదుర్తి సుబ్బారావు కాంబినేషన్ విజయ దుందుభి మోగించింది. ఆ తరువాత ‘బాబూ మూవీస్’లోనూ ఏయన్నార్, ఆదుర్తి విజయఢంకా మోగించడానికి నాంది పలికిన చిత్రం ‘మంచిమనసులు’. సావిత్రి, కృష్ణకుమారి నాయికలు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ‘మంచి మనసులు’ చిత్రంతోనే కేవీ మహదేవన్ […]
చెన్నయ్ లో శుక్ర, శనివారాల్లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సౌత్ జోన్) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సమ్మెట్ జరుగుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రారంభించిన ఈ సమ్మెట్ లో దక్షిణాదికి చెందిన అగ్ర దర్శకులతో పాటు, స్టార్ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. విశేషం ఏమంటే… గత కొన్ని రోజులుగా ఈ సమ్మెట్ నిర్వహణ బాధ్యతలను ప్రధానంగా నలుగురు మహిళామణులు తమ భుజాలకెత్తుకుని సమన్వయంతో నిర్వహిస్తున్నారు. వారే […]
మ్యూజిక్ లో తమన్ బ్లాక్ బస్టర్! సింగింగ్ లో కార్తిక్ బ్లాక్ బస్టర్!! యాక్టింగ్ లో నిత్యామీనన్ బ్లాక్ బస్టర్!!! సో… ఈ ముగ్గురి మూవీస్ కు సంబంధించిన పాటలతో ఈ వీకెండ్ తెలుగు ఇండియన్ ఐడిల్ ఎపిసోడ్ సాగింది. గతంలో కంటే మరింత ఫన్ గా, కాస్తంత డిఫరెంట్ గా ఈ ఎపిసోడ్ ను మొదలు పెట్టారు. పార్టిసిపెంట్ జయంత్… శ్రీరామచంద్ర స్థానంలోకి హోస్ట్ గా వచ్చే సరికీ జడ్జీలు కాస్తంత కంగారు పడ్డారు. అయితే… […]