ఆసియా కప్ 2025లో భాగంగా అబుదాబి స్టేడియంలో హాంగ్ కాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ సెదిఖుల్లా అటల్ (73; 52 బంతుల్లో 6×4, 3×6) హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో అజ్మతుల్లా ఒమర్జాయ్ వీరవిహారం చేశాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 53 రన్స్ బాదాడు. మహమ్మద్ నబీ (33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. […]
చర్లపల్లి డ్రగ్ కేసులో పట్టుబడ్డ వోలేటి శ్రీనివాస్, విజయ్‌కి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉందా?. అమెరికా కంపెనీ కోసం ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ తయారు చేస్తున్నాడనే వాదనలో నిజమెంత?, ముంబై కోర్టులో పోలీసులు ఏం వాదించారు?. చర్లపల్లిలో మెఫిడ్రిన్ డ్రగ్స్ వ్యవహారం.. ఇప్పుడు ముంబైకి షిఫ్ట్ అయింది. ఈ కేసులో వాగ్దేవి ఫార్మా యజమాని వోలేటి శ్రీనివాస్‌తో పాటు వోలేటి విజయ్, మరో వ్యక్తి తానాజీని పోలీసులు ముంబైకి తరలించారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. అంతే కాదు.. 15 […]
ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన సగం కాలిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసులో కీలక పురోగతి సాధించారు పోలీసులు. తోటి స్నేహితుడే, ఇద్దరు మైనర్ల స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని హత్య చేశాడని నిర్ధారించిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అసలు హత్య ఎందుకు చేశారనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో ఈ నెల 3న దారుణ హత్య జరిగింది. క్రీడా మైదానం వద్ద సరిగా పాతికేళ్లు కూడా నిండని యువకుడి మృతదేహం […]
ప్రస్తుత రోజుల్లో పశుపోషణ లాభదాయకమైన వ్యాపారంగా మారింది. పాల ఉత్పత్తి రంగంలో గేదెల పెంపకం మంచి ఆదాయంగా నిరూపించబడింది. పశుపోషకులు పాలు అమ్మడం ద్వారా ప్రతి నెలా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఈ వ్యాపారం వ్యవసాయంతో పాటు రైతులకు అదనపు ఆదాయ సాధనంగా మారుతోంది. ఇక డెయిరీ ఫామ్ వ్యాపారులు అయితే బోలెడు డబ్బును వెనకేసుకుంటుంటారు. రైతులు అయినా, డెయిరీ ఫామ్ వ్యాపారులు అయినా అధికంగా పాలు ఇచ్చే కొన్ని గేదె జాతుల గురించి తప్పక తెలుసుకోవాలి. […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ స్పై మ్యూజియం (వాషింగ్టన్ డీసీ)లో బెస్ట్ మూవీగా ‘ఏక్ థా టైగర్’ మూవీ పోస్టర్ ప్రదర్శించబడింది. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక సినిమా ఏక్ థా టైగర్. థియేటర్లలో విడుదలైన పదమూడు సంవత్సరాల తర్వాత ఈ ప్రత్యేకమైన అంతర్జాతీయ గౌరవాన్ని ఈ సినిమా దక్కించుకుంది. ఇది భారతీయ సినిమాకు గర్వకారణం అని చెప్పొచ్చు. అరుదైన గౌరవంతో జేమ్స్ […]
Maharashtra Tops the List in iPhone Sales: ప్రతి సంవత్సరం భారతదేశంలో కొత్త ఐఫోన్ లాంచ్ కోసం ‘యాపిల్’ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. నేడు ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కానుంది. ఇందుకోసం యాపిల్ కంపెనీ కాలిఫోర్నియాలోని కుపర్టినోలో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్లో ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఇండియాలో ఉన్న ఐఫోన్ లవర్స్ ఈ ఈవెంట్‌ను లైవ్‌గా రాత్రి 10:30 గంటల నుంచి చూడొచ్చు. యాపిల్ అధికారిక వెబ్సైట్ apple.comలో లైవ్ స్ట్రీమ్ అందుబాటులో […]
‘యాపిల్’ కంపెనీ తన కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ నేపథ్యంలో ఈసారి కూడా ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది. ‘అ డ్రాపింగ్’ పేరుతో యాపిల్ పార్క్‌లో ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ఈరోజు రాత్రి జరగనుంది. ఈ ఈవెంట్లో ఐఫోన్ 17 సిరీస్ నాలుగు మోడళ్లను మనం చూడవచ్చు. యాపిల్ ఈవెంట్ టైమ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఏంటో ఓసారిచూద్దాం. ఐఫోన్ 17 లాంచ్ […]
ఆసియా కప్ 2025 మరికొన్ని గంటల్లో యూఏఈలో ఆరంభం కానుంది. సెప్టెంబర్ 10న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ తన మొదటి మ్యాచ్ యూఏఈతో ఆడనుంది. టోర్నీ కోసం టీమిండియా ప్లేయర్స్ గత వారం రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆసియా కప్‌లో పాల్గొనే 8 దేశాల కెప్టెన్లు సోమవారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ సన్నద్ధత గురించి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ప్రెస్ మీట్లో సూర్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురవగా.. […]
ఆసియా కప్ 2025 మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. సెప్టెంబర్ 10న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, యూఏఈ మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 12న ఒమన్‌తో పాకిస్తాన్ తలపడనుంది. ఇక సెప్టెంబర్ 14న హై ఓల్టేజ్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ బౌలర్ ఉస్మాన్ ఖాన్ షిన్వారీ రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో 12 ఏళ్ల అతడి కెరీర్ ముగిసింది. తాజాగా ఆసిఫ్ అలీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. […]
మరికొన్ని గంటల్లో ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. ఈరోజు రాత్రి ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ మొదలవనుంది. బుధవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో యూఏఈతో భారత్ తలపడనుంది. ఆసియా కప్ ప్రారంభం నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఆధ్వర్యంలో 8 మంది కెప్టెన్లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పలు ప్రశ్నలకు జవాబిచ్చాడు. సంజూ శాంసన్‌పై ప్రశ్నకు సూర్య తనదైన శైలిలో రిప్లై […]