Asia Cup 2025: పసికూన హాంగ్ కాంగ్‌ను ఉతికారేసిన అఫ్గానిస్తాన్.. ఒమర్జాయ్ వీరవిహారం!
- హాంగ్ కాంగ్‌పై అఫ్గానిస్తాన్ భారీ స్కోర్
- 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు
- అజ్మతుల్లా ఒమర్జాయ్ వీరవిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ 2025లో భాగంగా అబుదాబి స్టేడియంలో హాంగ్ కాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ సెదిఖుల్లా అటల్ (73; 52 బంతుల్లో 6×4, 3×6) హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ చివరలో అజ్మతుల్లా ఒమర్జాయ్ వీరవిహారం చేశాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 53 రన్స్ బాదాడు. మహమ్మద్ నబీ (33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాంగ్ కాంగ్ బౌలర్లలో ఆయుష్ శుక్లా, కించిత్ షా తలో రెండు వికెట్స్ పడగొట్టారు.
Also Read: Cherlapally Drug Case: దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉందా?.. చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారా?
Also Read
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే అఫ్గాన్ జట్టుకు షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (8), ఇబ్రహీం జద్రాన్ (1)లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో సెదిఖుల్లా అటల్, మహమ్మద్ నబీ జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరు అవుట్ కావడంతో అఫ్గాన్ 150 పరుగులు చేస్తుందా? అని అందరూ అనుకున్నారు. అయితే అజ్మతుల్లా ఒమర్జాయ్ హాంగ్ కాంగ్ బౌలర్లపై వబిరుచుకుపడ్డాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. పసికూన హాంగ్ కాంగ్‌పై ఒమర్జాయ్ తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. హాంగ్ కాంగ్ విజయ లక్ష్యం 189 రన్స్.
6 6 6 4 & 20 Balls fifty For Azmatullah Omarzai.!!🤯🤯 pic.twitter.com/F01YO22R37
— Moazam Chaudhary (@Moazamch98) September 9, 2025
Big day as we kick off the Asia Cup! Always proud to wear the Afghan jersey and fight for our people. Time to give it everything. pic.twitter.com/0rRO6JmXda
— Azmatullah Omarzai (@AzmatOmarzay) September 9, 2025
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!