కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2025లో ఆడుతున్న ముగ్గురు క్రికెటర్లను దుండగులు తుపాకీతో బెదిరించి నిలువునా దోచుకున్నారు. ఈ సంఘటన సెప్టెంబర్ 9న అర్థరాత్రి బార్బడోస్‌లో చోటుచేసుకుంది. సెయింట్స్ కిట్స్‌కు చెందిన ఇద్దరు ప్లేయర్స్, నెవిస్ పేట్రియాట్స్‌కు చెందిన ఓ ప్లేయర్ సహా సీపీఎల్‌కు చెందిన ఓ అధికారిని దుండగులు దోచుకున్నారు. ప్లేయర్ ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొని తిరిగి వస్తుండగా దుండగులు వారిపై దాడికి దిగారు. దుండగులు తుపాకీతో బెదిరించి ఓ క్రికెటర్ మెడలోని గొలుసును […]
ఆసియా కప్ 2025లో భారత్ తన తొలి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో తలపడుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం యూఏఈ బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రాక్టీస్ సెషన్లో సిక్సర్ల మోత మోగించాడు. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో జరిగిన భారత్ ట్రైనింగ్ సెషన్లో అభిషేక్ గంట పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ […]
టీమిండియా బ్యాటర్ ‘రింకు సింగ్’ పేరు చెప్పగానే.. అందరికీ టక్కున గుర్తొచ్చేది ఐపీఎల్ 2023. ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడుతూ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోని చివరి ఓవర్లో పెను విధ్వంసమే సృష్టించాడు. యశ్ దయాల్ వేసిన 20వ ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది.. కోల్‌కతాకు ఊహించని విజయాన్ని అందించాడు. 5 బంతుల్లో 28 పరుగులు అవసరం అయినా సమయంలో రింకు సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్‌ను సగటు క్రికెట్ అభిమాని […]
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా మరికొద్దిసేపట్లో భారత్, యూఏఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వికెట్ చాలా ఫ్రెష్‌గా ఉందని, రెండో ఇన్నింగ్స్‌లో మంచు పడే అవకాశాలు ఉన్నాయని సూర్య చెప్పాడు. ఇక్కడ 3-4 మంచి ప్రాక్టీస్ సెషన్లు చేశామని చెప్పాడు. అయితే భారత తుది జట్టు అందరి అంచనాలకు బిన్నంగా ఉంది. ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ బరిలోకి దిగనున్నారు. […]
ఆసియా కప్ 2025లో భారత్ తన ప్రయాణంను నేడు మొదలెట్టనుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య యూఏఈని టీమిండియా ఢీకొట్టనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్.. ఈసారీ హాట్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నా.. భారత్ మాదిరి పటిష్టంగా లేవు. నేడు యూఏఈపై భారత్ భారీ విజయం సాదిస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చిక్కుల్లో పడ్డాడు. ఆసియా […]
‘అనిల్ సుంకర’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరు. విదేశాల్లో వ్యాపార రంగంలో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమా నిర్మాణం మీద ఉన్న మక్కువతో భారత్‌లో చిత్ర నిర్మాణాన్ని స్థాపించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌ను స్థాపించి.. తన స్నేహితులు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటతో కలిసి సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా 2011లో ‘దూకుడు’ సినిమా నిర్మించారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో […]
Google Pixel 9 Price Drop: ప్రముఖ ఇ- కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫ్లిప్‌కార్ట్’ ఏటా నిర్వహించే ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్ సెప్టెంబర్ 23 నుంచి మొదలుకానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ అండ్ బ్లాక్ మెంబర్లకు ఒక రోజు ముందుగానే.. సెప్టెంబర్ 22నే సేల్ అందుబాటులోకి రానుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు భారీగా అందించనుంది. తాజాగా కొన్ని మొబైల్స్‌పై అందిస్తున్న డీల్స్‌ను ఫ్లిప్‌కార్ట్ రివీల్ చేసింది. ‘గూగుల్ పిక్సెల్ 9’ […]
ఆసియా కప్ 2025లో భాగంగా మరికొన్ని గంటల్లో యూఏఈతో భారత్ తలపడనుంది. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. తుది జట్టులో ఎవరుంటారు అనే దానిపై ఇప్పటికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ కసరత్తు చేశారు. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, నలుగురు బౌలర్లు ప్లేయింగ్ 11లో ఉండే అవకాశాలు ఉన్నాయి. యూఏఈతో మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశారు. యూఏఈపై […]
India Playing 11 vs UAE: ఆసియా కప్ 2025 నిన్న ఆరంభమైంది. టోర్నీని అఫ్గానిస్థాన్ ఘన విజయంతో మొదలు పెట్టింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో 94 పరుగుల తేడాతో హాంకాంగ్‌ను చిత్తుగా ఓడించింది. నేడు భారత్ తన తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు యూఏఈని ఢీకొట్టనుంది. కీలక పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు సన్నాహకంగా ఈ పోరును వాడుకోవాలని టీమిండియా చూస్తోంది. అయితే టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనే ఆసక్తి […]
రీజినల్ రింగు రోడ్డుకు (నార్త్ పార్ట్) సంబంధించి 90 శాతం భూ సేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక, క్యాబినెట్ అనుమతి కోరారు. జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌కు అనగుణంగా రీజినల్ రింగు రోడ్డు (సౌత్ పార్ట్)కు అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కోరారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈరోజు కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి […]