iPhone Sales: ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ కాదు.. ఐఫోన్ కొనుగోలుదారులు ఎక్కువగా ఎక్కడున్నారో తెలుసా?
- నేడు ఐఫోన్ 17 సిరీస్ లాంచ్
- ఐఫోన్ కొనుగోలుదారులు ఎక్కువగా ఎక్కడున్నారో తెలుసా?
- అమ్మకాల్లో రెండవ స్థానంలో గుజరాత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra Tops the List in iPhone Sales: ప్రతి సంవత్సరం భారతదేశంలో కొత్త ఐఫోన్ లాంచ్ కోసం ‘యాపిల్’ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. నేడు ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ కానుంది. ఇందుకోసం యాపిల్ కంపెనీ కాలిఫోర్నియాలోని కుపర్టినోలో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఇండియాలో ఉన్న ఐఫోన్ లవర్స్ ఈ ఈవెంట్‌ను లైవ్‌గా రాత్రి 10:30 గంటల నుంచి చూడొచ్చు. యాపిల్ అధికారిక వెబ్‌సైట్ apple.comలో లైవ్ స్ట్రీమ్ అందుబాటులో ఉంటుంది. త్వరలోనే ఐఫోన్ 17 సిరీస్ ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి. అయితే మనదేశంలో ఐఫోన్ కొనుగోలుదారులు ఎక్కువగా ఎక్కడున్నారో తెలుసుకుందాం.
ఐఫోన్ కొనుగోలుదారులు ఎక్కువగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఎక్కువగా ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ మహారాష్ట్రలో గరిష్టంగా ఐఫోన్లు అమ్ముడవుతాయి. టాటా కంపెనీ క్రోమా నిర్వహించిన పరిశోధన ప్రకారం… సెప్టెంబర్ 2024-ఆగస్టు 2025 మధ్య భారతదేశంలో అమ్ముడైన మొత్తం ఐఫోన్లలో నాలుగో వంతు కంటే ఎక్కువ మహారాష్ట్రలో అమ్ముడయ్యాయి. ఇందులో ముంబై, పూణే సహా ఇతర ప్రాంతాలు ఉన్నాయి. 11 శాతం ఐఫోన్లు అమ్ముడైన గుజరాత్ రెండవ స్థానంలో ఉండగా.. 10 శాతంతో ఢిల్లీ మూడవ స్థానంలో ఉంది.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Also Read: Apple Event 2025: నేడే ‘ఐఫోన్’ 17 లాంచ్ ఈవెంట్.. టైమ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
దాదాపు 86 శాతం మంది సాధారణ ఐఫోన్‌లను కొనుగోలు చేశారు. ప్రో మోడళ్లకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి తొమ్మిది మందిలో ఎనిమిది మంది సాధారణ ఐఫోన్‌ను ఎంచుకున్నారు. ప్లస్, ప్రో మాక్స్ మోడళ్లను తక్కువగా కొనుగోలు చేశారు. స్టోరేజ్ విషయంకు వస్తే.. 128GB మోడల్ అత్యంత ప్రజాదరణ పొందింది. దాదాపు మూడింట ఒక వంతు మంది 128GB మోడల్ కొనుగోలు చేశారు. 256GB మోడల్ రెండో స్థానంలో ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ఫోన్ కలర్ విషయానికి వస్తే.. బ్లాక్ కలర్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఆ తరువాత నీలం, తెలుపు ఉన్నాయి. యాపిల్ ఎన్ని కొత్త రంగులను విడుదల చేసినా.. జనాలు మాత్రం క్లాసిక్ రంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!