Sampath Kumar
Author- NTV Telugu-
Wings India 2024: బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ ప్రదర్శన ప్రారంభం!
బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో ‘ఇంటర్నేషనల్ వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శన ప్రారంభం అయింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆరంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏవియేషన్ రంగనిపుణులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు వింగ్స్ ఇండియా 2024 జరగనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. […] -
Tammineni Veerabhadram: తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన డిప్యూటీ సీఎం!
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి గురించి ఏఐజీ ఆసుపత్రి వైద్యులను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. తమ్మినేని త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. తమ్మినేని గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం వెంట మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ […] -
Free Bus For Women: మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిల్!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. టీఎస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఈ ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓ ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణ వసతి కల్పించడం వివక్ష కిందకే వస్తుందని పిల్లో పేరొన్నారు. […] -
Kalti Kallu: గోదావరిఖనిలో విషాదం.. మందు పార్టీ అనంతరం ఇద్దరు స్నేహితుల దుర్మరణం!
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలో బుధవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. మందు పార్టీ చేసుకుని ఇంటికి వస్తుండగా.. ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందారు. ఇద్దరి మరణానికి కల్తీ కల్లు కారణం అని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వేంటనే కల్తీ కల్లు దుకాణాన్ని మూసేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరమే ఇద్దరి మరణానికి గల కారణాలు తెలియరానున్నాయని పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… నవీన్, […] -
Hanu Man: హీరో తేజ సజ్జాను అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి!
Union Minister Kishan Reddy Praises Hanu Man Movie: టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా నటించిన తాజా సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ సినిమా.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే వంద కోట్ల మైలురాయిని దాటిన ఈ సినిమా.. మరో మార్క్ దిశగా దూసుకెళుతోంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు […] -
108 Ambulance: సహకరించని 108 సిబ్బంది.. ప్రైవేటు ఆటోలో ఆస్పత్రికి బాధితురాలి తరలింపు!
పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఓ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది నిరాకరించారు. 108 వాహనంలో డీజిల్ లేదని, తాము ఏం చేయలేమని చెప్పారు. ఇక చేసేది లేక బాధితురాలిని కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందించడంతో ఆ మహిళ ప్రాణాపాయం నుంచి బయట పడింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… మోమిన్‌పేట మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన సాలెమ్మ (33) […] -
IND vs AFG: విరాట్ కోహ్లీ కెరీర్లో ఇదే తొలిసారి.. స్టేడియం మొత్తం గప్‌చుప్!
Virat Kohli Records First Golden Duck in T20Is: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అఫ్గన్ పేసర్ ఫరీద్ అహ్మద్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన విరాట్.. మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఇబ్రహీం జద్రాన్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరకుండానే నిష్క్రమించాడు. తద్వారా తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలిసారిగా […] -
Rohit Sharma: టీ20ల్లో తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు!
Most Hundreds in T20: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. హిట్‌మ్యాన్ 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121 పరుగులు బాదాడు. 2019 తర్వాత టీ20 ఫార్మాట్లో తన తొలి సెంచరీ నమెదు చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20లలో రోహిత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ సెంచరీతో టీ20ల్లో రోహిత్ సరికొత్త […] -
IND vs AFG: డబుల్ ‘సూపర్’ ఓవర్.. అఫ్గాన్‌పై భారత్ త్రిల్లింగ్ విక్టరీ!
IND beat AFG in Second Super Over: అఫ్గానిస్థాన్, భారత్ జట్ల మధ్య నామమాత్రమనుకున్న మ్యాచ్.. సిక్సులు, ఫోర్లు, నరాలు తెగే ఉత్కంఠతో అభిమానులకు అసలైన మజాను అందించింది. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టి.. మంచి వినోదాన్ని పంచింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం ఉత్కంఠ రేపిన మూడో టీ20లో రెండో సూపర్ ఓవర్లో అఫ్గానిస్థాన్‌ను భారత్ ఓడించింది. ముందుగా మ్యాచ్ టై (212 పరుగులు) కాగా.. తొలి సూపర్ ఓవర్ ఓవర్లో ఇరు జట్లు 16 […] -
AUS vs WI: చెలరేగిన హాజిల్‌వుడ్, కమిన్స్.. ఓపెనర్‌గా స్టీవ్ స్మిత్ విఫలం!
Steven Smith Out for 12 as Test Opener: రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం తొలి మ్యాచ్ ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజులో ఉస్మాన్ ఖవాజా (౩౦), కామెరాన్ గ్రీన్ (6) ఉన్నారు. విండీస్ అరంగేట్రం పేసర్ షమార్ జోసఫ్ 2 వికెట్లు తీశాడు. అయితే ఓపెనర్ అవతారం ఎత్తిన […]
తాజావార్తలు
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!