USA Tragedy: ఎంఎస్ పూర్తి.. జాబ్ చేసే టైమ్‌లో కాటేసిన మృత్యువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA Tragedy: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. బర్మింగ్‌హామ్ లోని అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నట్లు సమాచారం. హఠాత్తుగా చెలరేగిన మంటలతో ఉక్కిరిబిక్కిరైనా విద్యార్థులు.. అపార్ట్‌మెంట్‌లో ఫైర్ ప్రారంభమైన కాసేపటిలోనే ఘాటైన పొగ వెలువడడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో కేకలు వేశారు. ప్రాణ భయంతో వణికిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుల్లో విద్యార్థిని సహజరెడ్డి ఒకరు. సహజరెడ్డి కుటుంబం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపురం నివాసం ఉంటోంది.
READ MORE: Netflix: నెట్‌ఫ్లిక్స్ చేతికి వార్నర్ బ్రదర్స్.. ఏకంగా రూ. ఆరున్నర లక్షల కోట్ల భారీ డీల్..!
Also Read
తాజాగా ఈ విషాద ఘటనపై సహజారెడ్డి మామయ్య NTVతో మాట్లాడారు. “2021లో ఎంఎస్ చేయడానికి వెళ్ళింది.. మన టైం ప్రకారం గురువారం రాత్రి జాబ్ నుండి వచ్చి తన గదిలో పడుకుంది.. పక్కనే ఉన్న మరో బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. గాలి తీవ్రతకు పక్క బిల్డింగ్ లో తన గదిలో పడుకున్న సహజ గదికి వ్యాపించాయి.. దట్టమైన పొగ, మంటలు రావడంతో సహజతో పాటు మరో ముగ్గురు బిల్డింగ్‌లో ఉండిపోయారు. ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడగా సహజ, మొరాకో అబ్బాయి 80 శాతం కారిపోయారు.. వెంటనే ఆస్పత్రికి తరలించగా, ట్రీట్మెంట్ తీసుకుంటూ సహజ చనిపోయింది. ప్రస్తుతం పోస్ట్ మార్టం పూర్తయ్యింది.. అవసరమైన ఫార్మాలిటీస్ చేస్తున్నారు.. మా బంధువులు ప్రస్తుతం అక్కడే ఉన్నారు.. సిబ్బంది వెంటనే స్పందించి, అవసరమైన సహకారం అందిస్తున్నారు.. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయితే మంగళవారం బయల్దేరి గురువారం వరకు సహజ డెడ్‌డాడీ ఇంటికి చేరుకుంటుంది.. లేదంటే మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం.. ఎంఎస్ పూర్తి చేసి మంచి జాబ్ సంపాదిస్తుందనే టైంలో ఇలా జరిగింది.. సహజ పేరెంట్స్ జయకర్‌రెడ్డి, శైలజలు తట్టుకోలేకపోతున్నారు.. తీవ్ర విషాదంలో ఉన్నారు..” అని ఆయన వివరించారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు