Garlic is good for your Heart Health: ప్రస్తుత రోజుల్లో ప్రజలు బిజీ లైఫ్‌లో తమ ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని కారణంగా ప్రతి ఒక్కరిలోనూ వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న వయసులో ఉన్న వారు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ‘కొలెస్ట్రాల్’ రక్తనాళాల్లో పేరుకుపోవడమే. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువుగా ఉంటుంది. ఈ ప్రమాదం నుంచి బయట పడాలంటే.. తప్పనిసరిగా జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి. మెడిసిన్స్ జోలికి పోకుండా.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే రక్తంలో కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు.
‘వెల్లుల్లి’ని ప్రతి ఇంట్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతి వంటకంలో దీనిని వేస్తారు. వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా.. మీ గుండెని కూడా కాపాడుతుంది. వెల్లుల్లిలో శరీరంలోని కొలెస్ట్రాలను కరిగించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. గుండె జబ్బుతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ వెల్లుల్లిని తీసుకోవడం చాలా మంచిది. వెల్లుల్లి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
Also Read: Weight Loss Mistakes: పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. బరువు తగ్గకపోగా పెరుగుతారు!
వెల్లుల్లి ప్రయోజనాలు (Garlic Health Benfits):
# రోజు వాకింగ్ చేసే సమయంలో రెండు వెల్లుల్లి రెబ్బలు నోట్లో వేసుకుని.. చప్పరిస్తూ పోవాలి. దాంతో గుండె పనితీరు మెరుగు పడుతుంది.
# వెల్లుల్లి రక్తం గడ్డలు కట్టకుండా చేస్తుంది. కాల్చిన వెల్లుల్లిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
# వేయించిన వెల్లుల్లిని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా మంచిది.
# ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లితో పాటు నిమ్మరసం తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం వలన మూత్రపిండాలకు సంబంధించిన అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
#వెల్లుల్లి తినడం వల్ల టెస్టోస్టిరాన్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. పురుషుల లైంగిక శక్తి పెంచడలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ప్రతి రోజు 2-3 రెబ్బలను తింటే ఎంతో మంచిది.
# వెల్లుల్లి రెండు రెబ్బల చూర్ణంను ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది.
# మధుమేహ వ్యాధిగ్రస్తులకు నిమ్మకాయ, వెల్లుల్లిని తీసుకోవచ్చు. రక్తంలో చక్కెరను తగ్గించడంలో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Also Read: Asia Cup 2023: ఆసియా కప్ 2023.. మాట మార్చిన పీసీబీ కొత్త ఛైర్మన్!