Samsung Galaxy M34 5G Launch: శాంసంగ్ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. సూపర్ లుకింగ్, బెస్ట్ ఫీచర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy M34 5G Launch Date and Price in India: దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ ‘శాంసంగ్’.. భారతదేశంలో మిడ్-రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ విషయాన్ని శాంసంగ్ స్వయంగా ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం34 (Samsung Galaxy M34 5G) స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్‌లో రిలీజ్ చేయనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54 (Samsung Galaxy F54 5G) లాంచ్ తర్వాత కంపెనీ M సిరీస్‌లో భాగంగా ఈ 5G ఫోన్‌ను విడుదల చేస్తోంది. గెలాక్సీ ఎం34 టీజర్ ఇప్పటికే రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
Samsung Galaxy M34 5G Launch:
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్‌ఫోన్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని శాంసంగ్ కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ డిజైన్ టీజర్‌లో చూపబడింది. ఇతర M సిరీస్‌ల మాదిరిగానే.. ఈ ఫోన్ కూడా ఫ్లాట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఎం34 5జీ వెనుక ప్యానెల్ డిజైన్ ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ S23 సిరీస్‌ని పోలి ఉండవచ్చనని తెలుస్తోంది. గెలాక్సీ ఎం34 ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లతో సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఎం34కు సంబందించిన వివరాలను పంచుకున్నాడు.
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
- Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
Samsung Galaxy M34 5G Price:
టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్‌ఫోన్ ధర 20వేల సెగ్మెంట్‌లో ఉంటుంది. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎం33 5G స్మార్ట్‌ఫోన్ 6GB + 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 15,999 ప్రారంభ ధరతో వస్తుంది. అయితే గెలాక్సీ ఎం34 ధర ఎక్కువగా ఉండనుంది. ఈ ఫోన్ అమెజాన్ ద్వారా విక్రయించబడుతుంది. అలానే శాంసంగ్ స్టోర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు.
Also Read: iPhone 14 Price Drop: రూ.30900 వేలకే ఐఫోన్ 14.. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్! కొనడానికి ఎగబడుతున్న జనాలు
Samsung Galaxy M34 5G Disply:
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో 6.6-అంగుళాలఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో రానుంది. సెల్ఫీ కెమెరాతో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్డ్ డిజైన్ ఉంటుంది. ఫోన్ హుడ్ కింద ఉన్న మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్‌సెట్ నుంచి పవర్ అందిస్తుంది. గెలాక్సీ ఎం34 సరికొత్త ఆండ్రాయిడ్ OS వెర్షన్‌తో రానుంది. ఈ కొత్త ఫోన్ ఆండ్రాయిడ్ 13OSతో రానుంది. ఈ ఫోన్ స్లిమ్ మరియు సొగసైనదిగా కనిపిస్తుంది.
Samsung Galaxy M34 5G Camera and Battery:
శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంటుంది. ఇందులో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP సెకండరీ కెమెరా, 5MP కెమెరా ఉండనుంది. సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. టైప్-C పోర్ట్‌ను కలిగి ఉండే ఈ ఫోన్ బరువు దాదాపు 199 గ్రాములు ఉండే అవకాశం ఉంది. ఎం34 5జీ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?