Royal Enfield Classic 650 Testing Bigins: దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ బైక్స్ వరుసగా విడుదల అయ్యే అవకాశం ఉంది. రానున్న సంవత్సరాల్లో పలు బైక్‌లను విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇందులో 350సీసీ నుంచి 650సీసీ వరకు పలు కొత్త మోడల్‌లు ఉన్నాయి. ఆరు 650సీసీ బైక్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో షాట్‌గన్ 650, హిమాలయన్ 650, బుల్లెట్ 650, క్లాసిక్ 650, స్క్రాంబ్లర్ 650 మరియు రెట్రో-శైలి కాంటినెంటల్ జీటీ 650 రేసింగ్ బైక్‌లు ఉండే అవకాశం ఉంది. షాట్‌గన్ 650, స్క్రాంబ్లర్ 650 ఇప్పటికే స్పైడ్ టెస్టింగ్ చేయబడ్డాయి. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 (Royal Enfield Classic 650) స్పైడ్ టెస్టింగ్ చేయబడింది.
Royal Enfield Classic 650 Design:
స్పైడ్ టెస్టింగ్ సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బ్లాక్ కలర్‌లో కెమెరాకు చిక్కింది. క్లాసిక్ 650 బైక్ ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనకాల డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లను కలిగి ఉండనుంది. ఈ బైక్‌కు రెట్రో-శైలి వృత్తాకార ఎల్‌ఈడీ హెడ్‌లైట్, సైడ్ ఇండికేటర్‌లు ఉండనున్నాయి. స్పోక్డ్ వీల్స్, పొడవైన మడ్‌గార్డ్‌లు, నిటారుగా ఉండే హ్యాండిల్‌బార్ మరియు సెంటర్-సెట్ ఫుట్‌పెగ్‌లతో ఈ బైక్ వస్తుంది. క్లాసిక్ 650 పెట్రోల్ ట్యాంక్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
Also Read: Heart Health Tips: గుండె జబ్బులకు వెల్లుల్లి మంచి ఔషధం.. ఈ షాకింగ్ ప్రయోజనాలు తెలుసా?
Royal Enfield Classic 650 Features:
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్ కలర్ టీఎఫ్టీ డిస్‌ప్లే, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్పర్ నావిగేషన్ డిస్‌ప్లే, రెండు ట్రిప్ మీటర్లతో రానుంది. క్లాసిక్ 350 వంటి స్విచ్‌గేర్‌తో రావచ్చని అంచనా. ఈ బైక్ ముందు, వెనకాల డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉండనుంది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో ఉండే అవకాశం ఉంది.
Royal Enfield Classic 650 Price:
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 ఆయిల్-కూల్డ్, ట్విన్-సిలిండర్ ఇంజన్‌తో రానుంది. ఇది స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉండనుంది. ఈ బైక్ 7250 ఆర్పీఎం వద్ద 47 BHP, 52 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 2025లో లాంచ్ అవుతుందని అంచనా. ప్రారంభ ధర రూ. 3 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు.
Also Read: Weight Loss Mistakes: పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. బరువు తగ్గకపోగా పెరుగుతారు!