Sampath Kumar
Author- NTV Telugu-
Girl Drinking Beer: లైవ్ మ్యాచ్‌లో ఒక్క గుటికలోనే బీర్ మొత్తం తాగేసిన మహిళా అభిమాని.. వీడియో వైరల్!
Lady Fan Drinking Beer in SA20 Cricket League: దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వైపు మ్యాచ్ రసవత్తరంగా సాగుతుంటే.. మరోవైపు స్టాండ్స్‌లో ఉన్న ఓ మహిళా అభిమాని ఒక్క గుటికలోనే గ్లాస్ బీర్ మొత్తం తాగేసింది. అంతేకాదు పక్కన ఉన్న వారి గ్లాస్ కూడా తీసుకుని గుటుక్కుమంది. ఈ ఘటనతో స్టాండ్స్‌లో ఉన్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన […] -
Rinku Singh: 2వ టెస్ట్ మ్యాచ్‌కు రింకూ సింగ్!
Rinku Singh added to India A squad: టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ భారత్-ఏ జట్టుతో కలిశాడు. జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే 2వ అనధికారిక నాలుగు రోజుల టెస్ట్‌లో ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడే భారత జట్టులో అతడు ఆడనున్నాడు. ఇంగ్లండ్ లయన్స్ ప్రస్తుతం మూడు అనధికారిక టెస్టు పర్యటనలో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి అనధికారిక టెస్ట్ డ్రాగా ముగిసింది. రజత్ పాటిదార్, కేఎస్ భారత్ సెంచరీలతో భారత్ డ్రా […] -
Glenn Maxwell: పూటుగా తాగి ఆస్పత్రి పాలైన మ్యాక్స్‌వెల్.. దర్యాప్తుకు ఆదేశించిన క్రికెట్ ఆస్ట్రేలియా!
Glenn Maxwell under investigation by CA: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా అడిలైడ్‌లో రాత్రిపూట పూటుగా మద్యం సేవించిన మాక్స్వెల్.. అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీరియస్ అయ్యింది. మాక్స్‌వెల్‌ను దర్యాప్తుకు రావాలని సీఏ ఆదేశించింది. ప్రస్తుతం ఈ సంఘటనపై సీఏ విచారణ జరుపుతోందని తెలుస్తోంది. ఆస్పత్రి పాలైన మ్యాక్స్‌వెల్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని తెలుస్తోంది. బీబీఎల్ 2024లో మెల్బోర్న్ స్టార్స్ […] -
IND vs ENG: పాటిదార్, పుజారా కాదు.. విరాట్ కోహ్లీ స్థానంలో కొత్త ఆటగాడికి అవకాశం!
Suyash Prabhudessai likely to replace Virat Kohli: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టులకు అతడు దూరమయ్యాడు. జనవరి 25న ఆరంభం అయ్యే తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తుండగా.. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ రెండు టెస్టులకు విరాట్ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది […] -
BCCI Awards 2024: శుభ్‌మన్ గిల్, రవిశాస్త్రిలకు బీసీసీఐ అవార్డులు!
BCCI Awards 2024: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, భారత పురుషుల క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రిలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్మానించనుంది. హైదరాబాద్‌లో ఈరోజు జరిగే బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో 2023 మేటి క్రికెటర్ (క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023) అవార్డుతో గిల్‌ను, జీవితకాల సాఫల్య పురస్కారంతో రవిశాస్త్రిని సత్కరించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా 2019 తర్వాత […] -
IND vs ENG: తెలుగు అభిమానులకు బ్యాడ్‌న్యూస్.. తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరం!
India Star Virat Kohli Out from first two England Tests: తెలుగు క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్. ఇంగ్లండ్‌తో హైదరాబాద్, వైజాగ్ వేదికలుగా జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తప్పుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలిపింది. విరాట్ దూరం కావడానికి కారణంపై ఊహాగానాలు అస్సలు చేయొద్దని మీడియా, అభిమానులను బీసీసీఐ కోరింది. ఐదు టెస్టుల […] -
T20 World Cup 2024: పంత్, ఇషాన్ టీ20 ప్రపంచకప్ 2024 రేసులో ఉన్నారు: ద్రవిడ్
Rishabh Pant, Ishan Kishan in contention for T20 World Cup 2024 Said Rahul Dravid: టీ20 ప్రపంచకప్ 2024 ముందు భారత్ ఆఖరి పొట్టి సిరీస్ ఆడేసింది. ఇక ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ అనంతరం భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2024లో ఆడనున్నారు. ఆపై యూఎస్, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతారు. ఈ పొట్టి టోర్నీలో ఎవరికి అవకాశం దక్కుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […] -
Ramam Raghavam: ‘రామం రాఘవం’ ఫస్ట్ లుక్ విడుదల!
Ramam Raghavam Movie First Look Out: ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో, కమెడియన్ ధన్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి ‘రామం రాఘవం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రామం రాఘవం ఫస్ట్ లుక్‌ను ఇరవై రెండు […] -
IPL 2024 Schedule: ఐపీఎల్ 2024 షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆందోళనలో బీసీసీఐ!
BCCI plans IPL 2024 from March 22 to May 26: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 17వ సీజన్‌కు సంబందించిన షెడ్యూల్ దాదాపు ఖరారైంది. 2024 మార్చి 22న ఐపీఎల్ ప్రారంభించేందుకు బీసీసీఐ ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇక మే 26న ఫైనల్ జరిగేలా షెడ్యూల్ రూపొందించిందని సమాచారం. 17వ సీజన్‌కు సంబందించిన షెడ్యూల్‌పై బీసీసీఐ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. మార్చిలోనే సార్వత్రిక ఎన్నికలు […] -
Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మరో సంచలనం.. రెండుసార్లు చాంపియన్‌కు షాకిచ్చిన టీనేజర్!
Victoria Azarenka knocked out by Dayana Yastremska in Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. వరల్డ్ నంబర్ 1 ఇగా స్వియాటెక్ మూడో రౌండ్లోనే నిష్క్రమించగా.. తాజాగా రెండుసార్లు చాంపియన్, బెలారస్ భామ విక్టోరియా అజరెంకకు షాక్ తగిలింది. సోమవారం జరిగిన నాలుగో రౌండ్లో 93వ ర్యాంకర్, ఉక్రెయిన్‌కు చెందిన డయానా యస్ట్రెమస్క చేతిలో అజరెంక ఓడిపోయింది. 7-6(6), 6-4తో అజరెంకను డయానా మట్టికరిపించింది. ఈ మ్యాచ్ 2 […]
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!