Bro Movie Shoes: ‘బేబీ’ డైరెక్టర్‌కు ‘బ్రో’ షూస్.. ధర ఎంతో తెలుసా?! అస్సలు ఊహించరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby Movie Producer SKN Gives Costly Gift to Director Sai Rajesh: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించారు. యువ నిర్మాత ఎస్కేఎన్ ఈ సినిమాని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బేబీ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్కూల్, కాలేజ్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించారు. ఈ సినిమా జూలై 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
బేబీ సినిమా జూలై 14న రిలీజ్ కానుండడంతో.. ఇటీవల ఫస్ట్ కాపీని చిత్ర యూనిట్ చూసింది. నిర్మాత ఎస్కేఎన్‌కు ఈ సినిమా బాగా నచ్చేసిందట. దీంతో డైరెక్టర్ సాయి రాజేష్‌కు ఆయన స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ వేసుకున్న షూస్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సాయి రాజేష్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నిర్మాత ఎస్కేఎన్ తనకు షూస్ ఇస్తున్న ఫొటోను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Also Read
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
Also Read: Sitara Commercial Ad: సితార తొలి కమర్షియల్ యాడ్.. టైమ్ స్వ్కేర్‌పై ఫొటోల ప్రదర్శన!
పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కలిసి ఉన్న బ్రో పోస్టర్‌ను చిత్ర యూనిట్ మే నెలలో విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పవన్ వేసుకున్న షూస్ అందరినీ ఆకర్షించాయి. రెగ్యులర్ షూస్ మాదిరిగా కాకుండా.. చాలా డిఫరెంట్‌గా ఉండడంతో వాటి కోసం చాలామంది ఇంటర్నెట్‌లో వెతికారు. అయితే షూస్ ధర చూసి షాక్ తిన్నారు. పారిస్‌కు చెందిన లగ్జరీ బ్రాండ్ ‘బల్మైన్’ తయారుచేసిన ఈ షూస్ ధర రూ.1,06,870. ఇంతటి ఖరీదైన షూస్‌ను బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్‌కు నిర్మాత ఎస్కేఎన్ గిఫ్ట్‌గా ఇచ్చారు.
‘నా ప్రొడ్యూసర్ బ్రో బేబీ సినిమా ఫస్ట్ కాపీ చూశారు. ఈ బ్రో షూస్‌ను నాకు గిఫ్ట్‌గా ఇచ్చారు. లవ్ యూ ఎస్కేఎన్. మళ్లీ ఇంత ధర పెట్టి షూస్ కొనాలన్న ఆలోచన కూడా చాలా భయంగా ఉంది’ అని డైరెక్టర్ సాయి రాజేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. షూస్ ధర తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు.
https://twitter.com/sairazesh/status/1675924928946921473?s=20
తాజావార్తలు
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!