Mangalavaaram Teaser: ఒరేయ్ పులి.. నువ్ కాసేపు పూ మూసుకుని గమ్మునుండరా! ఆసక్తిగా మంగళవారం టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Payal Rajput New Movie Mangalavaaram Teaser Out: హాట్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజా నటిస్తున్న సినిమా ‘మంగళవారం’. ‘ఆర్ఎక్స్ 100’ వంటి భారీ హిట్ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ మరోసారి నటిస్తున్నారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న మంగళవారం సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇందులో భాగంగా నేడు టీజర్‌ను విడుదల చేసింది.
ఒక నిమిషం 18 సెకండ్ల నిడివి గల మంగళవారం సినిమా టీజర్.. ఆసక్తిగా ప్రారంభం అవుతుంది. గ్రామస్తులందరూ ఏదో చూసి భయపడుతున్న సీన్స్ చూపించారు. ఇక టీజర్ ‘ఏం చూశారండి’ అనే డైలాగ్‌తో ఆరంభం అవుతుంది. టీజర్ చివర్లో పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ లుక్‌లో అరుస్తూ కనిపించారు. ఇక ‘ఒరేయ్ పులి.. నువ్ కాసేపు పూ మూసుకుని గమ్మునుండరా’ అనే డైలాగ్ అందరికి నవ్వు తెప్పిస్తుంది. మొత్తానికి టీజర్ చాలా ఆసక్తిగా ఉంది.
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
Also Read: iPhone 15 Launch 2023: సెప్టెంబర్ 5న ఐఫోన్ 15 లాంచ్.. అదనంగా 5 ఫీచర్లు! యాపిల్ లవర్స్‌కు పండగే
ఆర్‌ఎక్స్ 100 సినిమాలో చేసిన విధంగా మరోసారి పాయల్ రాజ్‌పుత్ బోల్డ్ రోల్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో పాయల్ టాప్‌లెస్‌గా కనిపించారు. టీజర్‌లో బోల్డ్ సహా భయపెట్టారు కూడా. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో కమర్షియల్ హంగులతో మంగళవారం సినిమాను అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి జానర్ కథతో అజయ్ భూపతి అద్భుతమైన సినిమా తీస్తున్నట్లు నిర్మాత స్వాతి రెడ్డి గునుపాటి తెలిపారు. సినిమా పూర్తి చేయడానికి మొత్తం 99 రోజులు పట్టిందని.. 48 రోజులు పగటి పూట, 51 రోజులు రాత్రి వేళల్లో షూటింగ్ చేశామని చెప్పారు. గ్రామీణ నేపథ్యంలో నేటివిటీతో కూడిన కథతో ఈ సినిమా తీస్తున్న దర్శకుడు అజయ్ భూపతి పేర్కొన్నారు. సినిమాలో మొత్తం 30 పాత్రలు ఉన్నాయని, ప్రతి పాత్రకు కథలో ప్రాముఖ్యం ఉంటుందన్నారు. కాంతార సినిమా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రంకు సంగీతం అందిస్తున్నారు.
Also Read: Realme Narzo 60 Series Launch: రియల్‌మీ నార్జో 60 సిరీస్ లాంచ్.. డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!