Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. అయినా మగువలకు నిరాశే!
- భారీగా తగ్గిన బంగారం ధరలు
- తగ్గినా పెద్దగా సంతోషపడాల్సిన పరిస్థితి లేదు
- తెలుగు రాష్ట్రాల్లో లక్ష 41 వేలుగా వెండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ధరలు కొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. కొన్నాళ్లుగా పెరిగినప్పుడు వేళల్లో పెరిగి.. తగ్గినపుడు మాత్రం వందల్లో మాత్రమే తగ్గుతోంది. దాంతో బంగారం ధరలు తగ్గినా పెద్దగా సంతోషపడాల్సిన పరిస్థితి లేదు. పసిడి ధరలు వరుసగా రెండు రోజలు తగ్గినా.. తులం రేటు లక్షా 11 వేల పైనే ఉంది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500, 24 క్యారెట్లపై రూ.540 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (సెప్టెంబర్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,01,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.1,11,170గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,900గా.. 24 క్యారెట్ల ధర రూ.11,11,170గా కొనసాగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.1,02,050గా.. 22 క్యారెట్ల ధర రూ.1,11,320గా ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు రోజురోజుకు పరుగులు పెడుతున్న నేపథ్యంలో సామాన్య జనాలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి రోజుల్లో బంగారం షాపులు వద్ద జనాల సందడి తగ్గిందని నిపుణులు అంటున్నారు.
Also Read
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
Also Read: Pakistan Cricket: అక్కడ 16 మిలియన్ డాలర్లు.. పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు!
మరోవైపు వెండి పరిస్థితి కూడా అలానే ఉంది. వరుసగా రెండు రోజులుగా వెండి ధర తగ్గినా.. లక్ష 41 వేలుగా ఉంది. కిలో వెండిపై నిన్న 2 వేలు, ఈరోజు వెయ్యి తగ్గి.. బులియన్ మార్కెట్‌లో రూ.1,31,000గా ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 41 వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో లక్ష 31 వేలుగా ఉంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవి.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..