తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని నీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో రాష్ట్ర డీజీపీ ఆఫీసుకు గుర్తుతెలియని వ్యక్తులు ఈ–మెయిల్ చేశారు. వెంటనే అప్రమత్తమై పోలీసులు విజయ్ ఇంట్లో తనిఖీలు చేశారు. బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. అయితే ఇంట్లో పేలుడు పదార్థాలు ఏమీ లభించలేదు. దాంతో విజయ్ కుటుంబసభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కేసు నమోదు […]
ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘భారత దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ పరిరక్షణ యాత్ర సాగుతోంది. 11 ఏళ్లుగా ప్రధానిగా మోడీ కొనసాగుతున్నారు. నల్లధనం బయటకు తీస్తా అన్న మోడీ ఇప్పటికి ఒక్క రూపాయి తీసాడా?. మోడీ చెప్పిన వాగ్దానం అమలులో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తామన్న మోడీ ఇంతవరకు ఒక్క […]
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై 2025 దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ‘మూలా నక్షత్రం’ రోజు కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి అర్ధ రాత్రి నుంచే భక్తులను అనుమతించారు. దీంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. అమ్మవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వినాయక గుడి నుంచి సుమారు 3 కిమీ మేర భక్తులు బారులు తీరారు. ఉదయం 9:30 గంటలకు లక్ష […]
వైసీపీ కొత్తగా తెచ్చిన ‘డిజిటల్ బుక్’ యాప్‌లో ఆ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు అందుతున్నాయి. మాజీ మంత్రి విడదల రజినిపై తాజాగా ఫిర్యాదు అందింది. విడదల రజినిపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం ఫిర్యాదు చేశారు. 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయం, తన ఇంటిపై రజిని దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ మంత్రి రజినిపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. సొంత […]
ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే మూడు వికెట్స్ పడగొట్టి ఆసియా కప్ సొంతం చేసుకుందామనుకున్న పాకిస్థాన్‌కు తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్) షాక్ ఇచ్చాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన తిలక్.. తన కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండే ఇనింగ్స్ ఆడాడు. అతడికి […]
ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్‌తో జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ ఓడిపోయింది. ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఫర్హాన్ (57), ఫకార్ జమాన్ (46) రాణించారు. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తిలక్ వర్మ (69 నాటౌట్), శివమ్ దూబె (33), సంజూ శాంసన్ (24) రాణించడంతో లక్ష్యాన్ని భారత్ […]
ఆసియా కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్స్ తేడాతో గెలిచింది. పాక్ నిర్ధేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో రెండు బంతులు ఉండగానే ఛేదించి.. తొమ్మిదోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్; 53 బంతుల్లో 3×4, 4×6) అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. అయితే మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటుచేసుకుంది. ఆసియా […]
కుంభ రాశి వారికి నేడు అన్నీ కలిసిరానున్నాయి. ఈరోజు చేసే ప్రతి పని మీకు కలిసివస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. ఆర్ధిక విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం. ఈరోజు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ శాంకరి అమ్మవారు. ఈరోజు సరస్వతి అమ్మవారి స్తోత్రంను పారాయణం చేస్తే మంచింది. 12 రాశుల వారి పూర్తి వివరాలతో కూడిన నేటి రాశి ఫలాలు మీకోసం భక్తి టీవీ […]
ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ టైగా మారితే.. అర్ష్‌దీప్ సింగ్ అద్భుత బౌలింగ్‌తో శ్రీలంకను కట్టడి చేశాడు. మ్యాచ్‌లో అర్ష్‌దీప్ పెద్దగా ప్రభావం చూపలేదు. 4 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే పడగొట్టాడు. సూపర్ ఓవర్లో మాత్రం అదరగొట్టాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి.. పెరీరా, శనకను అవుట్ చేసి హీరో అయ్యాడు. […]
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, దళపతి విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో పెను విషాదం చోటుచేసుకుంది. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40కి పైగా మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలు కాగా.. అనేక మంది స్పృహతప్పి పడిపోయారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులలో పార్టీ కార్యకర్తలతో పాటు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా […]