కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లకు ఆహ్వాన ప్రక్రియ (టెండర్లకు ఆహ్వానం) ప్రారంభించింది. డిజైన్ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఆసక్తి పత్రాలను ఆహ్వానించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కమిటీ దర్యాప్తుల ఆధారంగా రిహాబిలిటేషన్ అండ్ రెస్టోరేషన్ డిజైన్లు చేయనుంది. డిజైన్ల కోసం ఆసక్తి పత్రాలు అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల లోపు సమర్పించాలి. అక్టోబర్ 15 సాయంత్రం 5 […]
నిజమాబాద్ జిల్లా సిరికొండ మండలం కోమన్ పల్లి గ్రామంలో వింత ఘటన చేసుకుంది. భార్యపై అలిగిన భర్త ఊళ్లోని కరెంట్ పోల్ ఎక్కి హంగామా చేశాడు. తాగిన మత్తులో భర్త కరెంట్ పోల్ మీదనే ఉండి రెండు గంటల పాటు హంగామా చేశాడు. పోలీసుల రంగ ప్రవేశంతో అతడు కిందకు దిగాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీటెయిల్స్ ఇలా ఉన్నాయి… కోమన్ పల్లి గ్రామంకు చెందిన సుమన్ అనే వ్యక్తి మద్యం మత్తులో భార్యతో […]
సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత్ బోణీ కొట్టింది. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లకు 269 పరుగులు సాధించింది. లక్ష్యాన్ని 271 పరుగులకు సవరించగా.. శ్రీలంక 45.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌట్ అయింది. ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన భారత్.. తన […]
సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్ 2025లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పీసీబీ చీఫ్, ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ప్లేయర్స్ తిరస్కరించారు. దాంతో నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు దక్కాల్సిన విజేత పతకాలను కూడా హాటల్‌కు తీసుకెళ్లిపోయాడు. దాంతో పీసీబీ, బీసీసీఐ మధ్య వివాదం చెలరేగింది. […]
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. జూలై 2024లో భారత మాజీ ప్లేయర్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. గౌతీ కోచ్‌గా వచ్చాక టీమిండియా అద్భుత విజయాలు అందుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025ను కైవసం చేసుకుంది. వివాదాస్పద నిర్ణయాలతో తరచుగా వార్తల్లో నిలిచే గంభీర్.. జట్టును మాత్రం అద్భుతంగా నడిపిస్తున్నారు. ఆసియా కప్ విజయం నేపథ్యంలో గౌతీ […]
యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ముగిసింది. అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ భారత్ ఆడనుంది. ఇక అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. భారత్, ఆసీస్ మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 19 నుంచి టీ20 సిరీస్, అక్టోబర్ 29 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్నాయి. అయితే వన్డే సిరీస్‌కు తమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దూరం […]
సినీ అభిమానులకు ‘ఐబొమ్మ’ వెబ్సైట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ ఓటీటీలో రిలీజైన కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలో పైసా ఖర్చు లేకుండా హెచ్డీ క్వాలితో అభిమానులకు ఐబొమ్మ (బప్పం) అందిస్తోంది. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్స్క్రిప్షన్ తగ్గడానికి కూడా పైరసీ సైట్ ఐబొమ్మనే కారణం. మొన్నటివరకు కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన కంటెంట్ మాత్రమే పైరసీ చేసి తమ సైట్లో పెడుతూ […]
జట్టు సభ్యులం అందరం కలిసి టీమిండియా గెలుపు కోసం కృషి చేశాం అని ఆసియా కప్ 2025 ఫైనల్ హీరో, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ తెలిపాడు. ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై మన దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతోనే ఆడానని చెప్పాడు. ఆసియా కప్ ఫైనల్లో చాలా ఒత్తిడిలోనే తాను బ్యాటింగ్ చేశానన్నాడు. ఆసియా కప్ టోర్నీలో అందరం సమష్టిగా కష్టపడ్డాం అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. ఫైనల్లో చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగిన […]
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటపై నకిలీ వార్తలు ప్రచారం చేసిన యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్‌ను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్‌పిక్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న జెరాల్డ్.. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఫేక్ కంటెంట్‌ను తన ఛానల్లో ప్రచారం చేశారు. టీవీకే పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాడని ఫిర్యాదులు అందడంతో పోలీసులు అతడిని […]
2025 దసరా, దీపావళి పండుగల వేళ బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. పండుగ వేళ పసిడి ధరలు భారీగా పరుగులు పెడుతున్నాయి. మొన్నటి వరకు వందల్లో పెరిగిన గోల్డ్ రేట్స్.. ఇప్పుడు వేలల్లో పెరుగుతోంది. వరుసగా రెండో రోజు వెయ్యిగా పైగా పెరిగింది. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1410 పెరగగా.. ఈరోజు రూ.1420 పెరిగింది. అలానే 22 క్యారెట్లపై రూ.1300, రూ.1300 పెరిగింది. దీంతో పసిడి ధర ఆల్‌టైమ్ రికార్డులను నమోదు చేస్తోంది. […]