ఏపీ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ చుక్కలు చూపిస్తున్నాడు. బత్తుల ప్రభాకర్ పరారీ వ్యవహారం పోలీసులకు పెను సవాలుగా మారింది. ఈ నెల 22న రిమాండ్ పొడిగింపు కోసం ప్రభాకర్‌ను పోలీసులు బెజవాడలో కోర్టుకు తీసుకువచ్చారు. తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తుండగా.. దేవరపల్లి దగ్గర ప్రభాకర్ పరారయ్యాడు. ప్రభాకర్‌ను పట్టుకోవటం కోసం బెజవాడ, పశ్చిమ గోదావరి నుంచి 5 బృందాలు ఏర్పాటు చేశారు. Also Read: Suryakumar Yadav: ఐపీఎల్లో పరుగుల వరద.. […]
ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాశపరిచాడు. స్పిన్నర్ వానిందు హసరంగ బౌలింగ్‌లో సూర్య ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 13 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 12 రన్స్ మాత్రమే చేశాడు. ఆసియా కప్ 2025లో సూరీడు ఒక్క మ్యాచ్ మినహా.. మిగతా మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌కు ఆడి 71 రన్స్ మాత్రమే చేశాడు. టోర్నీలో 7* (2), 47* […]
విజయవాడ దుర్గ గుడి ఆలయ బోర్డు సభ్యులుగా 16 మందిని నియమిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులకు దుర్గ గుడి ఆలయ బోర్డు సభ్యులుగా అవకాశం దక్కింది. కొద్ది రోజుల క్రితం దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌గా కృష్ణా జిల్లాకు చెందిన బొర్రా రాధాకృష్ణని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 16 మంది బోర్డు సభ్యుల లిస్ట్ ఓసారి చూద్దాం. Also Read: Sunil Gavaskar: ఐపీఎల్ ఆడుతా.. 76 ఏళ్ల […]
భారత జట్టు ప్రస్తుతం యూఏఈలో ఆసియా కప్ 2025లో ఆడుతోంది. రెండు సూపర్-4 మ్యాచ్‌లను గెలిచిన టీమిండియా ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. అయితే బంగ్లాదేశ్‌తో సూపర్-4 మ్యాచ్ అనంతరం టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. తనను జట్టులోకి తీసుకోవాలని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను కోరినట్లు చెప్పాడు. ఇందుకు సంబంధించిన […]
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్ర రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సవీంద్ర రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై విచారణ చేయాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. సీబీఐని సుమోటోగా ఇంప్లేడ్ చేసిన ఏపీ హైకోర్టు విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 13కి వాయిదా వేసింది. తాడేపల్లిలో ఉన్న సవీంద్ర రెడ్డిని అక్రమంగా నిర్బంధించిన లాలాపేట పోలీసులు పత్తిపాడు పోలీస్ స్టేషన్లో […]
ఆసియా కప్ 2025లో దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ జట్లు ముచ్చటగా మూడోసారి తలపడున్నాయి. సెప్టెంబర్ 28న జరగనున్న ఫైనల్లో ఇండో-పాక్ టీమ్స్ ఢీకొట్టనున్నాయి. గ్రూప్ స్టేజ్, సూపర్-4 మ్యాచ్‌లలో పాక్‌పై భారత్ ఘన విజయాలు సాధించింది. ఫైనల్లోనూ పాక్‌ను చిత్తు చేసి టైటిల్ పట్టాలని భారత్ చూస్తోంది. మరోవైపు భారత్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ చూస్తోంది. ఇప్పటివరకు ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాకిస్థాన్ ఢీకొట్టలేదు. దాంతో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌పై భారీ […]
త్వరలోనే విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విశాఖకు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సంచర్ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.6.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 125 కంపెనీలు వచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పుకొచ్చారు. పర్యాటక ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండుగా ఉన్నాయన్నారు. టెంపుల్ టూరిజంను 8 నుంచి 20 శాతానికి పెంచాలనేది లక్ష్యం అని, పర్యాటకంలో […]
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు వినటానికి సిగ్గుపడుతున్నాం అని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. బాలయ్య అసెంబ్లీలో మామూలుగా ఉన్నాడా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన ఒక్క కార్యక్రమంలో భాగమయ్యాడా? అని అడిగారు. ఒక మాజీ సీఎం వైఎస్ జగన్, చిత్ర పరిశ్రమలో ముఖ్య హీరో చిరంజీవిని అవమానించడం సరికాదని మండిపడ్డారు. మండలి చైర్లో ఒక దళితుడు కూర్చున్నాడని అవమానించాలని చూస్తున్నారన్నారు. రాజ్యాంగంలో ప్రతీ ఒక్కరికీ ప్రతిపాదించిన హక్కులు కాపాడాలని, కానీ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాజిస్టిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, రహదారి మార్గాలు, రైల్వే.. ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలని సూచించారు. భారత్‌లో లాజిస్టిక్స్ వ్యయం రూ.24.01 లక్షల కోట్లు అని, జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97 శాతంగా ఉందని వివరించారు. రవాణా రంగంలో రహదారి ద్వారా జరిగే రవాణా 41 […]
సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి అక్రమ అరెస్ట్ కేసు సీబీఐకి అప్పగించటం శుభపరిణామం అని వైసీపీ మాజీమంత్రి జోగి రమేష్ అన్నారు. ప్రజల గొంతు నులుమే సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని.. లీగల్‌గా, టెక్నికల్‌గా తప్పులు చేయటంలో చంద్రబాబు నేర్పరి అని విమర్శించారు. నేరాలు చేసి ఎలా తప్పించుకోవాలో కూటమి నేతలకు చంద్రబాబు నేర్పుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో వైఎస్ జగన్ నామస్మరణే తప్ప.. మరేమీ కనపడటం లేదని మండిపడ్డారు. ప్రజల మేలు కోసం […]