అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఇటీవల చెప్పినట్టుగానే.. కలప, ఫర్నిచర్‌పై సుంకాల మోత మోగించారు. కలపపై 10 శాతం.. కిచెన్ క్యాబినెట్లు, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్‌పై 25 శాతం సుంకాలను విధించారు. ఈ సుంకాలు అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా జాతీయ భద్రత, దేశీయ తయారీని పెంచడంలో భాగంగా ట్రంప్ టారిఫ్‌లను వరుసగా పెంచుతున్నారు. కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ పరికరాలు, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్, భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానంటూ ఇటీవల […]
పసికూన నేపాల్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్ట్ ఆడే దేశంపై మొదటిసారి ద్వైపాక్షిక సిరీస్‌ను నేపాల్ గెలుచుకుంది. సోమవారం షార్జా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో విజయం సాధించడంతో ఈ రికార్డు నెలకొల్పింది. రెండో టీ20లో వెస్టిండీస్‌ను 83 పరుగులకే ఆలౌట్ చేసి.. 90 పరుగుల తేడాతో గెలిచింది. మొదటి టీ20లో 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. నామమాత్రమేనా మూడో మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఈ సిరీస్ విజయం నేపాల్‌కు ఎంతో […]
ఈ సంవత్సరం భారతదేశంలోని చాలా ప్రాంతాలలో చలి ఎక్కువుగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని హిమాలయ ప్రాంతాలలో ఎముకలు కొరికేంత చలి ఉండనుంది. ఇందుకు కారణం ‘లా నినా’. పసిఫిక్ మహాసముద్రంలో లా నినా పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. లా నినా కారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు చలి ఎక్కువుగా కొనసాగే అవకాశం ఉంది. లా నినా పరిస్థితులు ప్రపంచ వాతావరణ నమూనాలను […]
మయన్మార్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. మయన్మార్ భూకంపం భారతదేశాన్ని కూడా కుదిపేసింది. మణిపూర్, నాగాలాండ్, అస్సాంతో సహా భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయి. ప్రస్తుతానికి ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం.. భూకంపం మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు ఆగ్నేయంగా 27 కిలోమీటర్ల దూరంలో, మయన్మార్‌లోని భారత సరిహద్దుకు చాలా దగ్గరగా […]
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఓ శుభవార్త. అయ్యప్ప స్వామి వారి దివ్య ప్రసాదం కోసం ఇకపై గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అసవరం లేదు. ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే స్వామివారి ప్రసాదాలను బుక్ చేసుకునే సదుపాయంను ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) కలిపిస్తోంది. ఈ సదుపాయం మరో నెలలో అమలులోకి రానుంది. టీడీబీ ప్రారంభించిన కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ సాయంతో శబరిమలతో పాటు ట్రావెన్కోర్ పరిధిలోని 1252 దేవాలయాల ప్రసాదాలను కూడా భక్తులు […]
నేడు మద్రాసు హైకోర్టులో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పిటిషన్‌పై విచారణ జరగనుంది. కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని సోమవారం టీవీకే పిటిషన్ వేసింది. పథకం ప్రకారం జరిగిన కుట్ర అనే అనుమానాన్ని టీవీకే న్యాయవాద విభాగం వ్యక్తం చేసింది. కేసును సుమోటోగా స్వీకరించాలని టీవీకే న్యాయవాదులు విన్నవించారు. ఆ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులోని మధురై బెంచ్ విచారణ జరపనుంది. వేలుస్వామిపురం వద్దకు తమిళ వెంట్రికళగం అధినేత విజయ వచ్చే సమయంలో వరసగా అంబులెన్స్‌లు […]
ఆసియా కప్ 2025 ముగిసిందని క్రికెట్ అభిమానులు చింతించాల్సిన అవసరం లేదు. నేటి నుంచే మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఆరంభం అవుతోంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ గువాహటిలో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను భారత్ ఢీకొట్టనుంది. సొంతగడ్డపై మెగా క్రికెట్ టోర్నీ జరుగుతుండడం, ఇటీవల ప్రదర్శన మెరుగ్గా ఉండడంతో టీమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండుసార్లు ఫైనల్ చేరినా విజేతగా నిలవని భారత జట్టు.. ఈసారైనా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందా? అన్నది చూడాలి. […]
తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు, దళపతి విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రచార సభ సమయంలో టీవీకే పార్టీనే పవర్ కట్ చేయమందని తమిళనాడు విద్యుత్తు బోర్డు అంటోంది. తమ పార్టీ అధినేత విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా ఆపేయాలని టీవీకే వినతిపత్రం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తమకు లేఖ ఇచ్చినట్లుగా విద్యుత్తు బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి ధ్రువీకరించారు. తాత్కాలికంగా […]
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది బీచ్‌లో సముద్రం వెనక్కి వెళ్లి, ముందుకు రావడంతో కలకలం రేపుతుంది. సముద్రం సాధారణం కంటే 500 మీటర్లు లోపలికి వెళ్లడంతో స్థానికులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఉదయం మార్నింగ్ వాక్కు వచ్చిన అంతర్వేది సర్పంచ్ కొండా జాన్ బాబు ఇది సునామీకి సంకేతం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రం వెనక్కి వెళ్లడంతో అంతర్వేది బీచ్‌లో పేరుకుపోయిన ఒండ్రు మట్టి బయటపడడంతో పర్యాటకులు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. Also Read: Asia Cup […]
టీమిండియా తొమ్మిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఆసియా కప్ 2025 ఫైనల్లో 5 వికెట్ల తేడాతో దాయాది పాకిస్థాన్‌ను ఓడించింది. కుల్దీప్ యాదవ్ (4/30), అక్షర్ పటేల్ (2/26), వరుణ్ చక్రవర్తి (2/30) మాయ చేయడంతో పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేదనలో భారత్ తడబడినా తెలుగు ఆటగాడు తిలక్ వర్మ (69 నాటౌట్; 53 బంతుల్లో 3×4, 4×6) అద్భుతంగా పోరాడడంతో భారత్ […]