RBI Repo Rate 2024: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది. వరుసగా ఏడోసారి కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఏప్రిల్ 3న ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు వెల్లడించారు. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆర్బీఐ ఎంపీసీ ప్రకటన. Also Read: Apple […]
Apple Laid Off 600 Employees: టెక్ కంపెనీలు లేఆఫ్‌ల పరంపరను కొనసాగిస్తున్నాయి. 2023లో లక్షల్లో ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజ కంపెనీలు.. 2024లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ ‘యాపిల్’ దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించింది. స్మార్ట్ కారు, స్మార్ట్‌వాచ్ డిస్ప్లే ప్రాజెక్టులను పక్కనపెట్టడమే ఇందుకు కారణం. అయితే ఈ తొలగింపులకు సంబంధించి ఇప్పటివరకు కంపెనీ నుండి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కంపెనీ ఇటీవల కాలిఫోర్నియా ‘ఎంప్లాయిమెంట్ డెవలప్మెంట్ […]
Full Demand for AC Tickets in Train: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఏప్రిల్ ఆరంభంలోనే జనాలు బయటికి రావాలంటే.. భయపడిపోతున్నారు. మండుతున్న ఎండలు ప్రయాణాలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఛార్జీలు కాస్త ఎక్కువైనా సరే.. ప్రయాణికులు ట్రైన్, బస్సుల్లో ఏసీ తరగతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బస్సుల్లో ఏసీ టికెట్లకు భారీ గిరాకీ ఉండగా.. రైల్లో ఏసీ ప్రయాణికుల వెయిటింగ్ లిస్టు 100-200ల పైనే ఉంటోంది. తీవ్ర […]
Who Is Shashank Singh: ఐపీఎల్ నుంచి మరో టాలెంటడ్ బ్యాటర్ ప్రపంచ క్రికెట్‌కు పరిచయమయ్యాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. ఓడిపోయే మ్యాచ్‌లో చెలరేగి.. తన జట్టుకు విజయం సాధించిపెట్టాడు. అతడు మరెవరో కాదు.. ‘శశాంక్ సింగ్’. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సంచలన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు […]
Family Star Movie Telecast Partner is Star Maa: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఫామిలీ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ‘గీతా గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఫ్యామిలీ స్టార్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ స్టార్ సినిమా నేడు (ఏప్రిల్ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. […]
Fans Try To Buy Tickets for MS Dhoni in Uppal Stadium: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఎంఎస్ ధోనీ’ నామస్మరణే. ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన మహీ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతుండడం ఒకటైతే.. ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని ప్రచారం జరుగుతుండడం రెండోది. అందుకే ఐపీఎల్ 2024లో ధోనీ ఆట చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. మిస్టర్ కూల్ ఏ నగరానికి వెళ్లినా.. స్టేడియాలు […]
Uppal Stadium Power Cut News: ఉప్పల్ స్టేడియంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీగా పేరుకుపోయిన బకాయిలు చెల్లించని కారణంగా.. విద్యుత్‌శాఖ అధికారులు గురువారం (ఏప్రిల్ 4) స్టేడియంలో కరెంట్ నిలిపివేశారు. కరెంట్ నిలిపివేయడంతో ఒక్కసారిగా స్టేడియం అంధకారంలో చిక్కుకుంది. జనరేటర్ల సహాయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో అసలు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? అన్న అనుమానాలు చెలరేగాయి. Also Read: HCA: బ్లాక్ […]
Ricky Ponting Hails Rishabh Pant Batting: కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు కనికరం లేకుండా ఆడారని ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అన్నాడు. ఇలాంటి ఆటతీరు ఆమోదయోగ్యం కాదన్నాడు. ఢిల్లీ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించారని, తొలి అర్ధభాగం ఆటను చూస్తే తనకు సిగ్గేసిందని తెలిపాడు. కోల్‌కతా మ్యాచ్‌లో చాలా పొరపాట్లను చేశామని, తర్వాత మ్యాచ్ నాటికి సమస్యలను పరిష్కరించుకుని బరిలోకి దిగాల్సి ఉందని పాంటింగ్ పేర్కొన్నాడు. బుధవారం విశాఖలో జరిగిన మ్యాచ్‌లో […]
Mrunal Thakur on Telugu Language: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమా రోజులను గుర్తుచేసుకున్నారు. సీతారామం సమయంలో తెలుగు రాకపోవడం వల్ల తాను రోజూ ఏడ్చానని తెలిపారు. తెలుగులో ఉన్న డైలాగును ఇంగ్లిష్‌లో రాసుకొని రాత్రంతా ప్రాక్టీస్ చేశానని చెప్పారు. హిందీ, మరాఠీల్లో కంటే తెలుగులో డైలాగ్స్ చెప్పడం చాలా కష్టంగా అనిపించిందని.. ఇక తెలుగు సినిమాల్లో నటించొద్దని తాను అనుకున్నానని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. సీతారామం అనంతరం ‘హాయ్ నాన్న’తో మంచి హిట్ అందుకున్న […]
Vijay Deverakonda’s Family Star Movie Run Time: పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ఎప్పుడో ప్రమోషన్స్ మొదలెట్టారు. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. […]