Mrunal Thakur: రోజూ ఏడ్చేదాన్ని.. తెలుగు సినిమాల్లో నటించొద్దనుకున్నా: మృణాల్ ఠాకూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur on Telugu Language: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమా రోజులను గుర్తుచేసుకున్నారు. సీతారామం సమయంలో తెలుగు రాకపోవడం వల్ల తాను రోజూ ఏడ్చానని తెలిపారు. తెలుగులో ఉన్న డైలాగును ఇంగ్లిష్‌లో రాసుకొని రాత్రంతా ప్రాక్టీస్ చేశానని చెప్పారు. హిందీ, మరాఠీల్లో కంటే తెలుగులో డైలాగ్స్ చెప్పడం చాలా కష్టంగా అనిపించిందని.. ఇక తెలుగు సినిమాల్లో నటించొద్దని తాను అనుకున్నానని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. సీతారామం అనంతరం ‘హాయ్ నాన్న’తో మంచి హిట్ అందుకున్న మృణాల్.. ‘ఫ్యామిలీ స్టార్’తో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.
విజయ్ దేవకరొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన మృణాల్ ఠాకూర్.. వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొదటి సినిమా రోజులను గుర్తుచేసుకున్నారు. ‘ఎప్పటికైనా మహారాణి పాత్రలో నటించాలని నా చిన్నప్పటి కల. అందుకే సీతారామం సినిమా కోసం చిత్ర యూనిట్ సంప్రదించగానే.. వెంటనే ఓకే చెప్పా. సినిమా కోసం మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. భాష రాకపోతే నటించడం చాలా కష్టం. తెలుగు రాకపోవడం వల్ల రోజూ ఏడ్చేదాన్ని’ అని మృణాల్ తెలిపారు.
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
Also Read: Family Star: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఫ్యామిలీ స్టార్’.. రన్‌టైం ఎంతంటే?
‘తెలుగులో ఉన్న డైలాగును ఇంగ్లిష్‌లో రాసుకొని.. రాత్రంతా ప్రాక్టీస్ చేసేదాన్ని. హిందీ, మరాఠీల్లో కంటే.. తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టంగా అనిపించింది. సీతారామం సినిమానే నా మొదటి, చివరి తెలుగు సినిమా అని షూటింగ్ జరిగేటప్పుడు దుల్కర్ సల్మాన్‌తో చెప్పాను. ఇక తెలుగులో అస్సలు సినిమా చేయనన్నాను. అందుకు దుల్కర్ నవ్వారు. ఈ సినిమా తర్వాత నీకు వరుస అవకాశాలు వస్తాయని నాతో అన్నారు. దుల్కర్ చెప్పిందే నిజమైంది. సినిమా రిలీజ్ అయ్యాక ఆ కష్టాన్నంతా మర్చిపోయా. ఇప్పుడు తెలుగు చాలా ఈజీగా ఉంది’ అని మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!