Family Star Movie Telecast Partner is Star Maa: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఫామిలీ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ‘గీతా గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఫ్యామిలీ స్టార్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ స్టార్ సినిమా నేడు (ఏప్రిల్ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.
ఫ్యామిలీ స్టార్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ కొనుగోలు చేసింది. ఈ సినిమా హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన 45 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుందట. ఒకవేళ సినిమా భారీ హిట్ కొట్టలేకపోతే మాత్రం నెల రోజుల్లోపే వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి ఫ్యామిలీ స్టార్ థియేటర్ల వద్ద ఏ రేంజ్‌లో ప్రభంజన సృష్టిస్తుందో. ఇక ఈ సినిమా టెలికాస్ట్ పార్ట్నర్ ‘స్టార్ మా’.
Also Read: CSK vs SRH: ఇప్పుడు హైదరాబాద్ వంతు.. ఎక్కడ చూసినా ధోనీ నామస్మరణే! జోరుగా బ్లాక్ టికెట్ల దందా
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండకు ఈ మధ్య వరుసగా ఫ్లాపులు పడ్డాయి. గీతా గోవిందం తర్వాత విజయ్ చేసిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి పెద్దగా ఆడలేదు. దాంతో కచ్చితంగా నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాలని భావించిన విజయ్.. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో వచ్చాడు. మరి ఈ సినిమా ఫలితం మరికొన్ని గంటల్లో రానుంది.