Rishabh Pant on Delhi Capitals Playoffs: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో ఆడుంటే.. ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరేదన్నాడు. తన వల్లే ఢిల్లీ గెలుస్తుందని కాదని, ఇంకాస్త మెరుగైన అవకాశాలు ఉండేవని చెబుతున్నా అన్నాడు. ఐపీఎల్ 2024లో మూడుసార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు పంత్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడింది. దీంతో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అతడు ఆడలేదు. ఆ మ్యాచ్‌లో […]
Sonakshi Sinha Funny Comments on Her Marriage: బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘హీరామండి’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెగెలిసిందే. స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్ లాహోర్‌లో ఉన్న వేశ్య వాటిక హీరామండిలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ని రూపొందించారు. ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో మే 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావు హైదరి, రిచా చద్ధా, సంజీదా షేక్, […]
SachinTendulkar Security Guard Died: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సచిన్ భద్రతలో ఉన్న స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్ఆర్పీఎఫ్) జవాన్.. జామ్నర్ పట్టణంలోని తన ఇంటిలో బుధవారం గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్రకాష్ కపాడేగా జామ్నర్ పోలీసులు గుర్తించారు. అతను సెలవుపై స్వగ్రామానికి వెళ్లినట్లు సమాచారం. Also Read: Sonakshi Sinha: హీరోయిన్స్ విషయంలోనే దర్శకనిర్మాతలు అలా ఎందుకు అడుగుతారో: సోనాక్షి బుధవారం తెల్లవారుజామున 1.30 […]
Sonakshi Sinha Comments on Heroines Remuneration: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తాజాగా ‘హీరామండి’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. హీరామండిలో రెహానా, ఫరీదన్ జహాన్ అనే రెండు పాత్రలను సోనాక్షి చేశారు. ముఖ్యంగా ఫరీదన్ పాత్రకు గాను ప్రశంసలు అందుకున్నారు. తాజాగా కపిల్ షోలో పాల్గొన్న సోనాక్షి.. రెమ్యునరేషన్‌పై ఆసక్తికర […]
Mehreen Pirzada lashed out at the media over Egg Freezing: తాను ఎగ్ ఫ్రీజింగ్ (అండాల శీతలీకరణ) చేయించుకున్నట్లు టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ఇటీవల తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ ‘నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రపంచంలోని చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలవాలని, ఎగ్ ఫ్రీజింగ్‌పై అవగాహన కల్పించడానికే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్స్.. […]
KL Rahul on LSG Defeat vs DC: పవర్ ప్లేలో కీలక వికెట్లను చేజార్చుకోవడమే ఈ సీజన్లో తమను దెబ్బ కొట్టిందని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. మంచి ఆరంభాలు ఇవ్వలేకపోవడమే పాయింట్ల పట్టికలో వెనకపడ్డానికి కారణం అని చెప్పాడు. చివరి మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటాం అని రాహుల్ ధీమా వ్యక్తం చేశాడు. మంగళవారం ఢిల్లీ చేతిలో లక్నో ఓడిపోయింది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం […]
Gautam Gambhir Fires on AB de Villiers: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమిస్తున్న విషయం తెలిసిందే. ముంబై ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే నమోదు చేసి.. 9 పరాజయాలతో మూల్యం చెల్లించుకుంది. మే 17న లక్నోతో లీగ్ చివరి మ్యాచ్ ఆడి.. ఇంటిదారి పడుతుంది. లీగ్ ఆరంభం నుంచే కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి. అభిమానులతో పాటు మాజీలు ముంబై సారథి హార్దిక్‌ను […]
Kajal Aggarwal React on Marriage with Gautam Kitchlu: ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ‘చందమామ’గా అందరికీ దగ్గరయ్యారు. మగధీరలో ‘మిత్రవింద’గా చేసి అభిమానుల మనసులను కొల్లగొట్టారు. ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మ్యాన్, నాయక్, బాద్షా, టెంపర్ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు. పెళ్లి తరువాత రొటీన్, రెగ్యులర్, కమర్షియల్ చిత్రాలను కాజల్ ఎంచుకోవడం లేదు. సినిమాలు అయినా.. వెబ్ సిరీస్‌లు అయినా తన […]
TVS iQube New Variants in India: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ‘టీవీఎస్’ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. తాజాగా మరో రెండు కొత్త వేరియంట్లను కంపెనీ రిలీజ్ చేసింది. కంపెనీ మొదటిసారిగా తమ లైనప్‌ను రిఫ్రెష్ చేసిన రెండు సంవత్సరాల తర్వాత ఇవి వచ్చాయి. దీంతో ఐక్యూబ్ స్కూటర్ ఇప్పుడు మూడు విభిన్న బ్యాటరీ ఎంపికలతో ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఐక్యూబ్ స్కూటర్ ఇప్పుడు 11 రంగుల్లో లభిస్తోంది. తాజాగా […]
Tata Play Joins Hands With Amazon Prime: కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ టాటా ప్లే.. అమెజాన్ ప్రైమ్‌తో జట్టు కట్టింది. డీటీహెచ్, బింజ్ కస్టమర్లకు ప్రైమ్ వీడియో ప్రయోజనాలను టాటా ప్లే అందించనుంది. దీంతో వివిధ ప్యాక్‌లతో సబ్స్క్రైబర్లు ఇటు టీవీ ఛానెళ్లతో పాటు అటు ప్రైమ్ లైట్ కంటెంట్‌ను వీక్షించొచ్చు. టాటా ప్లే మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హరిత్ నాగ్‌పాల్ మాట్లాడుతూ.. యాప్‌లను బండిల్ చేయడానికి ఇదో కొత్త మార్గం అని అన్నారు. టాటా […]