Kajal Aggarwal React on Marriage with Gautam Kitchlu: ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ‘చందమామ’గా అందరికీ దగ్గరయ్యారు. మగధీరలో ‘మిత్రవింద’గా చేసి అభిమానుల మనసులను కొల్లగొట్టారు. ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మ్యాన్, నాయక్, బాద్షా, టెంపర్ సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు. పెళ్లి తరువాత రొటీన్, రెగ్యులర్, కమర్షియల్ చిత్రాలను కాజల్ ఎంచుకోవడం లేదు. సినిమాలు అయినా.. వెబ్ సిరీస్‌లు అయినా తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘సత్యభామ’ చేస్తున్నారు.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ సత్యభామ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ టీవీ కార్యక్రమానికి హాజరై.. పలు విషయాలు పంచుకున్నారు. మీది ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిర్చినదా? అని అడగ్గా… ‘మాది ప్రేమ వివాహం. మేం ప్రేమించుకుని.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మొదటిసారి నేను గౌతమ్ కిచ్లూని స్నేహితుల పెళ్లిలో కలిశాను. గౌతమ్, నేను సుమారు మూడు సంవత్సరాలు డేటింగ్ చేశాం. ఆపై ఏడేళ్లుగా ఫ్రెండ్స్‌గా ఉన్నాం. కరోనా టైమ్‌లో మేము కొన్ని వారాలపాటు కలుసుకోలేదు. మాస్క్ వేసుకుని ఒక కిరాణా దుకాణంలో కలిసాము. అప్పుడే మాకు అర్ధమైంది మేము ఎంతలా ప్రేమించుకుంటున్నామో. ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం’ అని అన్నారు.
Also Read: TVS iQube Price: టీవీఎస్ ఐక్యూబ్‌లో కొత్త వేరియంట్స్.. బేస్ మోడల్ ధర ఎంతంటే?
‘నాకు తెలుగు సంప్రదాయాలంటే చాలా ఇష్టం. అందుకే నా పెళ్లిలో కొన్ని క్రతువులు మన సంప్రదాయానికి సంబంధించినవి కూడా ఉండేలా చూసుకున్నా. తెలుగులో నాకు ఎన్నో ఫేక్ పెళ్లిళ్లు చేసేశారు. అందుకే నిజం పెళ్లి కూడా అదే సంప్రదాయంలో చేసుకున్నా’ అని కాజల్ అగర్వాల్ చెప్పారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపుగా 60కి పైగా సినిమాలలో కాజల్ నటించారు. 2020 అక్టోబర్ 30న కాజల్, గౌతమ్ కిచ్లూల వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. గౌతమ్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త. బెస్పోక్ ఇంటీరియర్ డిజైన్ సంస్థ డిస్సర్న్ లివింగ్ వ్యవస్థాపకుడు అతడు.