Gautam Gambhir Fires on AB de Villiers: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమిస్తున్న విషయం తెలిసిందే. ముంబై ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే నమోదు చేసి.. 9 పరాజయాలతో మూల్యం చెల్లించుకుంది. మే 17న లక్నోతో లీగ్ చివరి మ్యాచ్ ఆడి.. ఇంటిదారి పడుతుంది. లీగ్ ఆరంభం నుంచే కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు వస్తున్నాయి. అభిమానులతో పాటు మాజీలు ముంబై సారథి హార్దిక్‌ను ఎగతాళి చేయడం. అతడి వ్యక్తిగత ప్రదర్శనను విమర్శించడంపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు.
హార్దిక్ పాండ్యా సారథ్యంపై మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏబీడీ ఘాటు వ్యాఖ్యలపై గౌతమ్ గంభీర్ కౌంటర్ వేశాడు. ఆరెంజ్‌లను ఆరెంజ్‌లతోనే పోల్చాలని, యాపిల్‌తో ఆరెంజ్‌లను పోల్చొద్దని గౌతీ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ కీడాలో గంభీర్ మాట్లాడుతూ…’ఏబీ డివిలియర్స్, కెవిన్ పీటర్సన్ కెప్టెన్‌లుగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రదర్శన చేశారు. ఏబీడీ, కెవిన్ గొప్పగా ఏమీ ఆడలేదు. వారి గణంకాలను మీరు ఓసారి పరిశీలించండి. ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గిన కెప్టెన్లు కాదు వారిద్దరు’ అని అన్నాడు.
Also Read: Kajal Aggarwal: ప్రేమించుకున్నాం.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం!
‘ఏబీ డివిలియర్స్, కెవిన్ పీటర్సన్‌లను ఇతర కెప్టెన్‌లతో పోలిస్తే.. పరిస్థితి దారుణంగా ఉంటుంది. వ్యక్తిగత స్కోర్లతో డివిలియర్స్ కప్‌ను గెలిపించిన సందర్భాలు లేవు. పీటర్సన్ కూడా అంతే. హార్దిక్ పాండ్యాకు అలాంటి పరిస్థితి లేదు. గుజరాత్ టైటాన్స్ జట్టును అతడు విజేతగా నిలిపాడు. కాబట్టి మీరు ఆరెంజ్‌లను ఆరెంజ్‌లతోనే పోల్చాలి. యాపిల్‌తో ఆరెంజ్‌లను పోల్చకూడదు. ఇకనైనా హార్దిక్‌ను ఎగతాళి చేయడం, విమర్శించడం ఆపేస్తే మంచిది’ అని గంభీర్ ఘాటుగా బదులిచ్చాడు.