SachinTendulkar Security Guard Died: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సచిన్ భద్రతలో ఉన్న స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్‌ఆర్‌పీఎఫ్) జవాన్.. జామ్‌నర్ పట్టణంలోని తన ఇంటిలో బుధవారం గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్రకాష్ కపాడేగా జామ్‌నర్ పోలీసులు గుర్తించారు. అతను సెలవుపై స్వగ్రామానికి వెళ్లినట్లు సమాచారం.
Also Read: Sonakshi Sinha: హీరోయిన్స్ విషయంలోనే దర్శకనిర్మాతలు అలా ఎందుకు అడుగుతారో: సోనాక్షి
బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ప్రకాష్ కపాడే తన సర్వీస్ గన్‌తో మెడపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని జామ్‌నర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ షిండే తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం వ్యక్తిగత కారణాల వల్లనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తాలించామని, వీవీఐపీ భద్రత కోసం మోహరించిన సెక్యూరిటీ గార్డు కాబట్టి దర్యాప్తు ముమ్మరంగా చేస్తామని కిరణ్ షిండే చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. కపాడేకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.