‘మహిళలకు రూ.2500 ఇవ్వండి సీఎం గారు.. అదొక్కటి చేస్తే ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్లే’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీనియర్ నేత వి.హనుమంతరావు కోరారు. మహిళలు కూడా అడుగుతున్నారని, జర అదొక్కటి చేయండి అని విజ్ఞప్తి చేశారు. సన్న బియ్యం ఇస్తా అని చెప్పలేదు కానీ ఇస్తున్నామన్నారు. దేశంలో కులగణన చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే అని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కోట్లడదాం అని వీహెచ్ చెప్పుకొచ్చారు. చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరైన సందర్భంగా వీహెచ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ… ‘అవార్డు గ్రహీత సల్మాన్ ఖుర్షీద్ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లో కీలక పాత్ర పోషించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. జీవో 9 షెడ్యూల్లో చేర్చాలి అంటే.. పార్లమెంట్లో ఆమోదం ఉండాలి. అది చేయాల్సిన బీజేపీ ఇప్పుడు డ్రామాలు చేస్తుంది. బీఆర్ఎస్, బీజేపీలు డ్రామాలు చేస్తున్నాయి. రేషన్ కార్డులు, సన్న బియ్యం అందరికీ ఇస్తున్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ లో కూడా అన్ని వర్గాలను ఒకే దగ్గర చదివేలా చేస్తుంది ప్రభుత్వం’ అని చెప్పారు.
Also Read: Mitchell Starc: రోహిత్‌కు స్టార్క్ బౌలింగ్.. 176.5 కిమీ స్పీడ్ ఏంటి సామీ?
‘దేశ ఐక్యత కోసం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారు. అప్పుడు ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా నేను పాల్గొన్నాను. గాంధీ కుటుంబానికి లాయల్గా ఉన్న వ్యక్తులలో ఖుర్షీద్ మొదటి స్థానంలో ఉంటారు. మచ్చలేని నాయకుడు ఖుర్షీద్. పాత బస్తీకి మెట్రో గురించి ఎవరు ఆలోచన చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి అందుకు అడుగులు వేస్తున్నారు. మా ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమానంగా ముందుకెళుతోంది. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది రాష్ట్రం. ప్రతిపక్షం కావాలని విమర్శలు చేస్తుంది’ అని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పుకొచ్చారు.