Diwali 2025: దీపావళికి స్వీట్స్ కొంటున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!
- రాష్ట్ర వ్యాప్తంగా 95 స్వీట్ షాప్‌పై తనిఖీలు
- నిబంధనలు పాటించని స్వీట్ షాప్‌లకు నోటీసులు
- ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 95 స్వీట్ షాప్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2025 దీపావళి సందర్భంగా స్వీట్ షాప్‌లపై రైడ్స్ చేపట్టారు. అధికారులు 157 శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్‌కి పంపారు. 60 కిలోల స్వీట్స్, 40 కిలోల బ్రెడ్ సీజ్ చేశారు. సింథటిక్ కలర్ ఉపయోగిస్తున్న స్వీట్లను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు పాటించని స్వీట్ షాప్‌లకు నోటీసులు ఇచ్చారు. ఎక్స్ పైర్ అయిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తింపు
కొన్ని స్వీట్ షాప్‌లలో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబెల్, ఎక్స్పైరీ డేట్ లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. స్వీట్స్ తయారు చేసే స్థలంలో ఈగలు, దోమలు ఉన్నట్లు గుర్తించచారు. కిచెన్‌లో పని చేసే వారు హెడ్ కాప్స్, గ్లౌజ్, యాప్రాన్స్ వేసుకోవట్లేదని యాజమాన్యంపై అధికారులు మండిపడ్డారు. స్వీట్‌లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారని, కిచెన్‌లు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. స్వీట్‌లపై వేసే సిల్వర్ ఫాయిల్స్ క్వాలిటీ లేనివి వాడుతున్నట్లు చెప్పారు. కల్తీ నెయ్యి, కల్తీ వంట నూనెతో నిర్వాహకులు స్వీట్స్ తయారు చేస్తున్నారు.
Also Read
Also Read: AUS vs IND: ఆస్ట్రేలియాతో భారత్ మొదటి వన్డే.. గంభీర్‌కు ఇష్టమైన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత!
దీపావళి గిరాకీ ఎక్కువగా వస్తుందని టన్నుల కొద్దీ స్వీట్స్ తయారు చేస్తుండటంతో.. క్రాస్ కంటామినేషన్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశముందని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అంటున్నారు. FSSAI రిజిస్ట్రేషన్ ఉన్న షాప్స్ నుంచి మాత్రమే స్వీట్స్ కొనాలని ప్రజలకు అధికారులు విజ్ఞప్తి చేశారు. కలర్ ఫుల్‌గా కనిపించే స్వీట్స్ అవాయిడ్ చేయడం బెటర్ అని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో దీపావళికి స్వీట్స్ కొనేవారు కాస్త జాగ్రతగా ఉండడం మంచిది.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్‌లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?