Nani-Janhvi Kapoor: జాన్వీ కపూర్‌తో సినిమా.. హీరో నాని ఏమన్నారంటే?
- ఆగష్టు 29న సరిపోదా శనివారం విడుదల
- వరుస ఇంటర్వ్యూలతో బిజీగా నాని
- కేవలం రూమర్ మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hero Nani About Janhvi Kapoor: ‘నేచురల్ స్టార్’ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ సినిమా విడుదలకు సిద్దమైంది. ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. తన తర్వాతి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుందన్న వార్తలపై స్పందించారు.
మీ తర్వాతి సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఫిక్స్ అయిందట కదా?, నిజమేనా? అని అడగగా.. ‘నా తదుపరి సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుందనేది కేవలం రూమర్ మాత్రమే. బహుశా జాన్వీని తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నేను కొన్ని రోజులుగా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. కాబట్టి నా నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియదు’ అని నాని సమాధానం ఇచ్చారు. శైలేష్ కొలను (హిట్ 3) లేదా సుజిత్ దర్శకత్వంలో నాని నటించనున్నారని తెలుస్తోంది.
Also Read
Also Read: Manu Bhaker: మను బాకర్‌కు స్ఫూర్తినిచ్చిన క్రీడాకారులెవరో తెలుసా?.. మనోళ్లే ముగ్గురు!
బాలీవుడ్‌లో స్టార్ అయిన జాన్వీ కపూర్.. టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న మొదటి పార్ట్ విడుదల కానుంది. బుచ్చిబాబు-రామ్ చరణ్ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో కూడా జాన్వీ నటించనున్నారు. నాని సినిమాకు కూడా జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తెలుగులో మూడో సినిమా అవుతుంది.
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!