Gold Price Today in Hyderabad: దీపావళి పండగ ముందు మగువలకు బ్యాడ్‌న్యూస్. వరుసగా నాలుగోరోజు బంగారం ధరలు పెరిగాయి. గత మూడు రోజుల్లో వరుసగా 450, 200, 800 పెరిగిన గోల్డ్ రేట్స్.. నేడు స్వల్పంగా రూ.10 పెరిగింది. శనివారం (అక్టోబర్ 19) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,410గా నమోదవగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,990గా నమోదైంది. నిన్న కిలో వెండిపై రెండు వేలు పెరగగా.. […]
Maiden Test Hundred for Sarfaraz Khan: బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 110 బంతుల్లోనే శతకం బాదాడు. టీమ్ సౌథీ వేసిన 57వ ఓవర్ మూడో బంతికి బౌండరీ బాదిన సర్ఫరాజ్.. కెరీర్లో తొలి సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. తొలి అంతర్జాతీయ సెంచరీ కావడంతో సర్ఫరాజ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో పరుగెత్తుతూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియోస్ […]
Team India Hit 100 Sixes in a Test Calendar Year: టెస్ట్ క్రికెట్లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. టెస్ట్ ఫార్మాట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో 100 సిక్స్‌లు బాదిన మొదటి జట్టుగా భారత్ రెకార్డుల్లోకెక్కింది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ ఈ ఫీట్ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆజాజ్ పటేల్ బౌలింగ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిక్సర్ బాదడంతో టీమిండియా 100 సిక్స్‌ల మైలురాయిని చేరుకుంది. 147 […]
బెంగళూరు వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తోంది. 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మూడోరోజు ఆట ముగిసేసరికి 231/3 స్కోరుతో నిలిచింది. రోహిత్ సేన ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. ఆట చివరి బంతికి విరాట్ కోహ్లీ (70) అవుట్ కాగా.. క్రీజ్‌లో సర్ఫరాజ్ ఖాన్ (70) ఉన్నాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ బ్యాటింగ్ […]
Rishabh Pant Batting Today in Bengaluru: బెంగళూరు టెస్టులో నేడు నాలుగో రోజు. మూడో రోజైన శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ 231/3 స్కోర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమైన రోహిత్ శర్మ (52; 63 బంతుల్లో 8×4, 1×6), విరాట్ కోహ్లీ (70; 102 బంతుల్లో 8×4, 1×6), సర్ఫరాజ్ ఖాన్ (70 బ్యాటింగ్; 78 బంతుల్లో 7×4, 3×6)లు జట్టును ఆదుకున్నారు. మూడో రోజు ఆటలో చివరి బంతికి కోహ్లీ అవుటయ్యాడు. […]
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో 231/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. అయినా కూడా టీమిండియా ఇంకా ఓటమి ఉచ్చులోనే ఉంది. ప్రస్తుతానికి భారత్ ఇంకా 125 పరుగులు వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటర్లు నాలుగోరోజైన శనివారం పూర్తిగా పోరాటాన్ని కొనసాగిస్తే తప్ప.. రోహిత్ సేన ఓటమి ఉచ్చులోంచి బయటికి రాదు. ఇప్పుడు భారం అంతా సర్ఫరాజ్ […]
New Zealand Women in T20 World Cup 2024 Final: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో న్యూజిలాండ్ అడుగుపెట్టింది. శుక్రవారం షార్జా వేదికగా హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌పై కివీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచకప్‌లో 14 ఏళ్ల విరామం తర్వాత కివీస్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్ 2009, 2010లలో ఫైనల్‌కు వెళ్లి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పటికే ఫైనల్‌కు దక్షిణాఫ్రికా చేరుకోవడంతో.. ఈసారి మహిళల […]
Royal Enfield Electric Bike Launch Date: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ ఉంది. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల సంఖ్య పెరుగుతోంది. ఈ డిమాండ్ కారణంగా అన్ని ఆటో కంపెనీలు ఈవీలపై దృష్టి పెడుతున్నాయి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘రాయల్ ఎన్ఫీల్డ్’ కూడా ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను నవంబర్ 4న ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ తాను […]
New Zealand All Out for 402 Runs: బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (134) సెంచరీ చేయగా.. టిమ్ సౌతీ (65), డెవాన్ కాన్వే (91) హాఫ్ సెంచరీలు బాదారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్స్ తీయగా.. మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 […]
Noman Ali fires Pakistan to Crushing win vs England: చాలా రోజుల తర్వాత సొంతగడ్డపై పాకిస్తాన్ టెస్టు విజయం సాధించింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో గెలిచింది. పాక్ నిర్దేశించిన 297 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 144 పరుగులకే ఆలౌటైంది. పాక్ స్పిన్నర్లు నొమన్ అలీ (8/46), సాజిద్ ఖాన్ (2/93) దెబ్బకు ఇంగ్లండ్ కుదేలైంది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 366 రన్స్ చేయగా.. ఇంగ్లండ్ […]