New Zealand All Out for 402 Runs: బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (134) సెంచరీ చేయగా.. టిమ్ సౌతీ (65), డెవాన్ కాన్వే (91) హాఫ్ సెంచరీలు బాదారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్స్ తీయగా.. మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కివీస్ 356 పరుగుల లీడ్‌లో ఉంది.
ఓవర్‌నైట్ 180/3 స్కోరుతో మూడోరోజు ఆటను ప్రారంభించిన కివీస్.. ఆదిలోనే వికెట్స్ కోల్పోయింది. సిరాజ్, బుమ్రా, జడేజా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ 233 రన్స్‌కు 7 వికెట్లు కోల్పోయింది. ఇక కివీస్ ఇన్నింగ్స్ ముగియడానికి ఇంకెంతసేపు పట్టదని అందరూ అనుకున్నారు. కానీ రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీలు ఎదురుదాడికి దిగారు. పేస్, స్పిన్ బౌలింగ్‌ను చితకొట్టారు. ముఖ్యంగా రవీంద్ర ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తిచేశాడు.
Also Read: PAK vs ENG: అదరగొట్టిన పాకిస్తాన్ స్పిన్నర్లు.. ఇద్దరే 20 వికెట్స్ పడగొట్టారు!
మరోవైపు సౌథీ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడీని విడదీయడానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకుండాపోయింది. హాఫ్ సెంచరీ అనంతరం సిరాజ్ బౌలింగ్‌లో సౌథీ అవుట్ అయ్యాడు. కుల్దీప్ పటేల్ చివరి రెండు వికెట్స్ తీయడంతో కివీస్ 402 రన్స్‌కు ఆలౌట్ అయింది. భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది. ఓపెనర్లు క్రీజులోకి వచ్చారు.