Royal Enfield Electric Bike Launch Date: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఫుల్ డిమాండ్ ఉంది. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల సంఖ్య పెరుగుతోంది. ఈ డిమాండ్ కారణంగా అన్ని ఆటో కంపెనీలు ఈవీలపై దృష్టి పెడుతున్నాయి. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ కూడా ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను నవంబర్ 4న ఆవిష్కరించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.
తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తాను లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన ఓ టీజర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసింది. టీజర్‌లో పారాచూట్ సాయంతో ఓ మోటార్ సైకిల్‌ను అంతరిక్షం నుంచి కిందకు దించుతున్నట్లు చూపించారు. సేవ్ ది డేట్ అంటూ ‘2024 నవంబర్ 4’ను హైలెట్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలను రాయల్ ఎన్‌ఫీల్డ్ పంచుకోలేదు. నవంబర్ 4న ఎన్‌ఫీల్డ్ ఈవీకి సంబందించిన అన్ని డీటెయిల్స్ తెలియరానున్నాయి.
Also Read: IND vs NZ 1st Test: 402 రన్స్‌కు న్యూజిలాండ్ ఆలౌట్.. భారత్‌పై 356 పరుగుల ఆధిక్యం!
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈవీ డిజైన్ సోషల్ మీడియాలో ఇప్పటికే లీకైంది. ఆ డీటెయిల్స్ ప్రకారం.. ఎలక్ట్రిక్ బైక్ లేటెస్ట్ క్లాసిక్ డిజైన్తో వస్తోంది. ఫ్యూయెల్ ట్యాంక్ స్థలంలో స్టోరేజ్ స్పేస్ ఉండొచ్చు. లీకైన ఇమేజెస్ సింగిల్ సీట్‌ను చూపిస్తున్నా.. పిలియన్ సీటును కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలుస్తోంది. హెడ్‌లైట్, ఇండికేటర్‌లు, సింగిల్-సీట్, టెయిల్ సెక్షన్ లాంటివి క్లాసిక్ శ్రేణి బైక్‌ల మాదిరిగానే డిజైన్ చేశారట. ఇది పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని తెలుస్తోంది. బ్యాటరీ బరువును తగ్గించడానికి అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్‌ను ఉపయోగించారట. రాయల్ ఎన్‌ఫీల్డ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సౌండ్. అయితే ఈ ఈవీలో సౌండ్ ఎలా వస్తుందా? అని అందరూ ఆసక్తి ఉన్నారు.