Noman Ali fires Pakistan to Crushing win vs England: చాలా రోజుల తర్వాత సొంతగడ్డపై పాకిస్తాన్ టెస్టు విజయం సాధించింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో గెలిచింది. పాక్ నిర్దేశించిన 297 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 144 పరుగులకే ఆలౌటైంది. పాక్ స్పిన్నర్లు నొమన్ అలీ (8/46), సాజిద్ ఖాన్ (2/93) దెబ్బకు ఇంగ్లండ్ కుదేలైంది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 366 రన్స్ చేయగా.. ఇంగ్లండ్ 291 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 221 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా సాజిద్ ఖాన్ నిలిచాడు.
Also Read: Pakistan Cricket: ఎట్టకేలకు పాకిస్తాన్ గెలిచిందోచ్.. 1338 రోజుల తర్వాత విజయం!
ఈ టెస్టులో పాకిస్థాన్ స్పిన్నర్లు నొమన్ అలీ, సాజిద్ ఖాన్ అదరగొట్టారు. ఈ ఇద్దరు కలిసి ఇంగ్లండ్ బ్యాటర్ల 20 వికెట్లను పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్‌లో సాజిద్ ఏడు వికెట్లు తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. నొమన్ మొదటి ఇన్నింగ్స్‌లో 3 పడగొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌కు ఇద్దరు స్పిన్నర్లే అడ్డుకట్ట వేయడం 1987 తర్వాత ఇదే తొలిసారి. టెస్టు చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఇద్దరు బౌలర్లే 20 వికెట్లు తీయడం ఇది ఏడోసారి.