ప్రతి ఏడాది మాదిరిగానే ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం భక్తి టీవీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవంబర్ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో దిగ్వజయంగా కొనసాగుతోంది. ఇల కైలాసంలో జరిగే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కోటి దీపోత్సవంలోని కార్యక్రమాలను వీక్షించి.. లోకాన్నే మైమరిచిపోయేలా పునీతులవుతున్నారు.
కోటి దీపోత్సవంలో ఇప్పటికే ఐదు రోజులు విజయవంతంగా ముగిసాయి. నేడు కోటి దీపోత్సవంలో ఆరవ రోజు. వైకుంఠ చతుర్దశి వేళ ఈరోజు జరిగే విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. నేడు శ్రీ స్వరూపానందగిరి స్వామీజీ, శ్రీ అవధూతగిరి మహారాజ్ స్వామీజీలు అనుగ్రహ భాషణం చేయనున్నారు. శ్రీ మంగళంపల్లి వేణుగోపాల శర్మ గారు ప్రవచనామృతం వినిపించనున్నారు. భక్తులచే శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాలకు కోటి పుష్పార్చన చేయిస్తారు. పల్లకీ వాహన సేవ ఉంటుంది.
Also Read: Varun Chakaravarthy: అశ్విన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ చేసిన వరుణ్ చక్రవర్తి!
ఆరవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే:
# శ్రీ స్వరూపానందగిరి స్వామీజీ (శ్రీలలితాపీఠం, తిరుపతి), శ్రీ అవధూతగిరి మహారాజ్ స్వామీజీ (బర్దీపూర్) అనుగ్రహ భాషణం చేయనున్నారు
# శ్రీ మంగళంపల్లి వేణుగోపాల శర్మ గారు ప్రవచనామృతం వినిపించనున్నారు
# వేదికపై ఆపదమొక్కులవాడికి మహాభిషేకం అష్టదళ పాదపద్మారాధన నిర్వహించనున్నారు
# భక్తులచే శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాలకు కోటి పుష్పార్చన జరగనుంది
# ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం జరగనుంది
# పల్లకీ వాహన సేవ ఉంటుంది