భక్తి టీవీ ఆధ్వర్యంలో కార్తిక మాసం శుభవేళ ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. రోజుకో కల్యాణం, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలు, భక్తులచే పూజలు, వాహన సేవలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం శివనామస్మరణతో మార్మోగిపోతోంది. ఈ దీపాల పండుగ వేళ హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. కోటి దీపోత్సవంలో పాల్గొని పునీతులవుతున్నారు. కోటి దీపోత్సవంలో ఇప్పటికే 14 రోజులు విజయవంతంగా ముగిసాయి. నేడు 15వ రోజుకు భక్తి టీవీ సిద్ధమైంది.
కార్తీక శనివారం వేళ ఈరోజు జరిగే విశేష కార్యక్రమాలు ఏంటో చూద్దాం. నేడు శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ (పెజావర్ మఠాధిపతి, ఉడుపి), శ్రీ మాధవానంద భారతి మహాస్వామీజీ (శ్రీమన్నెలేమావుమఠం శ్రీసంస్థానం, కర్ణాటక)లు అనుగ్రహ భాషణం చేయనున్నారు. బ్రహ్మశ్రీ డా.కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై కోటి తమలపాకుల అర్చన, అయోధ్య బాలరాముని మహాభిషేకం జరగనుంది. భక్తులచే ఆంజనేయ విగ్రహాలకు కోటితమలపాకుల అర్చన చేయిస్తారు. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం జరగనుంది. హనుమంత వాహన సేవ ఉంటుంది.
Also Read: Virender Sehwag: ఆర్యవీర్.. తృటిలో ఫెరీరా కారు మిస్ అయ్యావ్: సెహ్వాగ్
15వ రోజు విశేష కార్యక్రమాలు ఇవే:
# శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ, శ్రీ మాధవానంద భారతి మహాస్వామీజీ గారిచే అనుగ్రహ భాషణం
# బ్రహ్మశ్రీ డా.కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారిచే ప్రవచనామృతం
# వేదికపై కోటి తమలపాకుల అర్చన, అయోధ్య బాలరాముని మహాభిషేకం
# భక్తులచే ఆంజనేయ విగ్రహాలకు కోటితమలపాకుల అర్చన
# శ్రీ సీతారాముల కల్యాణోత్సవం
# హనుమంత వాహన సేవ