రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు అడ్డగోలుగా పెంచడం మీద ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం నాయకులు ఎదురు దాడి చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ధరలు నియంత్రించమని ప్రశ్నిస్తే.. ఆవు కథలాగా మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ తిప్పుతారన్నారు. ఒక్కో యూనిట్కి రెండు రూపాయలు చొప్పున పెరిగితే సామాన్యుడికి పెను భారంగా మారుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం 70 వేల కోట్లు అప్పు చేసిందని, దాంట్లో నుంచి సబ్సిడీ ఎందుకు ఇవ్వలేకపోతోంది అని […]
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యిందని.. ఈ కాలంలో రాష్ట్రంలో ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని, అభివృద్ధి అంతకంటే లేదని కడప వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, పాలన అనేదే లేకుండా పోయిందన్నారు. వైఎస్ జగన్ గారి హయాంలో వర్షాలకు పంట నష్టం జరిగితే అదే సీజన్లో తమ ప్రభుత్వం పరిహారం అందించిందని, ఇప్పుడు పంట నష్టపోయినా దిక్కు లేదని ఆగ్రహం […]
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరగనుంది. కాకినాడ పోర్టు వ్యవహారం సహా ఇతర కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించి.. భారీ ఎత్తున జరుగుతున్న రేషన్ బియ్యం […]
తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సమస్యల పరిష్కారంలో నేడు మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరగగా.. ఈరోజు సీఎస్ల నేతృత్వంలోని అధికారుల కమిటీ మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. విభజన అంశాలపై తొలిసారి ఏపీలో జరుగుతున్న సమావేశం ఇదే. ఏ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై అధికారుల కమిటీ చర్చించనుంది. ఏపీ పునర్వవ్యస్థీకరణ […]
భక్తులతో కిటకిటలాడుతున్న గోదావరి స్నానఘట్టాలు: కార్తిక మాసంలో వచ్చే చివరి రోజును పోలి పాడ్యమి (పోలి స్వర్గం) అంటారు. ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున పుణ్యస్నానాలు ఆచరించి.. చెరువులు, నదులలో దీపాలు వదులుతారు. అదే సమయంలో పోలి కథను కూడా చదువుకుంటారు. నేడు పోలి పాడ్యమి కావడంతో రాజమండ్రిలోని గోదావరి స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోదావరిలో పోలి పాడ్యామి స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పుణ్యస్నానాలతో రాజమండ్రిలోని పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి […]
కార్తిక మాసంలో వచ్చే చివరి రోజును పోలి పాడ్యమి (పోలి స్వర్గం) అంటారు. ఈరోజు మహిళలందరూ తెల్లవారుజామున పుణ్యస్నానాలు ఆచరించి.. చెరువులు, నదులలో దీపాలు వదులుతారు. అదే సమయంలో పోలి కథను కూడా చదువుకుంటారు. నేడు పోలి పాడ్యమి కావడంతో రాజమండ్రిలోని గోదావరి స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోదావరిలో పోలి పాడ్యామి స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తుల పుణ్యస్నానాలతో రాజమండ్రిలోని పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్లు కిక్కిరిపోయాయి. స్నానాలు ఆచరించిన […]
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో డిసెంబరు 3న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి నేడు తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేశారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు.. బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో 500 టోకెన్లు ఉదయం […]
నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ములుగు మండలం బండ తిమ్మాపూర్లో కొకకోలా ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించనున్నారు. హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ బండ తిమ్మాపూర్ చేరుకుంటారు. ఈరోజు ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డిలు పర్యటించనున్నారు. ఇద్దరు మంత్రులు పలు అభివృద్ధి పథకాలకు శంఖుస్థాపన చేయనున్నారు. నేడు సంగారెడ్డి జిల్లాలో బీసీ డెడికేటెడ్ కమిషన్ పర్యటించనుంది. జిల్లా జెడ్పి కార్యాలయంలో బీసీ రిజర్వేషన్లపై అభిప్రాయాలు కమిషన్ స్వీకరించనుంది. […]
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా అన్నారు. కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. నిధులు లేవంటూ మాజీ సీఎం వైస్ జగన్ గారిపై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆంజాద్ బాషా ఫైర్ […]
డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ కేసులకు భయపడి పారిపోయాడు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్లను కించపరిచేలా సినిమాలు తీశాడని.. ఇప్పుడు కేసులకు భయపడి అడ్రెస్ లేకుండా దాక్కున్నాడన్నారు. ఇప్పుడు దాక్కున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, వై.ఎస్.అవినాష్ రెడ్డిల గురించి సినిమా తీయరా? అని ఆర్జీవీని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. తల్లి, కూతుళ్లను వదిలేసిన వర్మను వెనుకేసుకొచ్చి మాట్లాడతావా అంటూ మాజీ […]