నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ములుగు మండలం బండ తిమ్మాపూర్‌లో కొకకోలా ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించనున్నారు. హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ బండ తిమ్మాపూర్ చేరుకుంటారు.
ఈరోజు ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డిలు పర్యటించనున్నారు. ఇద్దరు మంత్రులు పలు అభివృద్ధి పథకాలకు శంఖుస్థాపన చేయనున్నారు.
నేడు సంగారెడ్డి జిల్లాలో బీసీ డెడికేటెడ్ కమిషన్ పర్యటించనుంది. జిల్లా జెడ్పి కార్యాలయంలో బీసీ రిజర్వేషన్లపై అభిప్రాయాలు కమిషన్ స్వీకరించనుంది.
ఈరోజు విశాఖలోని పాయకరావు పేట నియోజకవర్గంలోలో హోంమంత్రి వంగలపూడి అనిత పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.
ఇవాళ ఉదయం 9 గంటలకు మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ కానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల పెండింగ్ అంశాలపై చర్చ జరగనుంది.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ క్వాష్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తున్నట్టు పిటిషన్‌లో వర్మ పేర్కొన్నారు. తనపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని వర్మ పిటిషన్ వేశారు.
ఏపీ రాష్ట్ర మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సినీ నటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ సహా ఇతరుల ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద నేడు ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది.
మహారాష్ట్ర ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది. బీజేపీ శాసన సభ్యులు సమావేశమై సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. దేవేంద్ర ఫడణవీస్‌కే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈరోజు ఉదయం 10 గంటలకు ఇండియా బ్లాక్ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరగనుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు ‘పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని’ ప్రారంభించనున్నారు.
నేడు కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండీ కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.