భారతదేశంలో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. పెరిగిన పసిడి ధరలు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.150, రూ.650 తగ్గగా.. 24 క్యారెట్లపై రూ.160, రూ.710 తగ్గింది. Also Read: […]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం ఐదవ రోజు వాడివేడిగా సమావేశం జరగనుంది. నేడు అసెంబ్లీలో నాలుగు ప్రభుత్వ బిల్లులతో సహా భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నేడు అసెంబ్లీలో ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపై సహా రైతు భరోసాపై చర్చ జరగనుంది.
హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్ పరిధి మాదన్నపేట చౌరస్తాలోని ఓ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు నల్లటి పొగ ఆ ప్రాంతమంతా దట్టంగా వ్యాపించింది. మంటలను చూసి పరిశ్రమలోని కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదంను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని.. 6 ఫైరింజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సోఫా మరియు తలుపులను […]
బలగం మూవీ ఫేమ్, జానపద కళాకారుడు మొగిలయ్య (67) కన్నుమూశారు. వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. బలగం సినిమాలో తన గాత్రంతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన మొగిలయ్య.. గత కొన్ని నెలలుగా కిడ్నీలు ఫేయిల్యూర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. మొగిలయ్య స్వగ్రామం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకర్గంలోని దుగ్గొండి. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి, నటీనటులు సంతాపం తెలిపారు. మొగిలయ్య వైద్య […]
నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ (హెచ్‌బీఎఫ్) ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 19 నుంచి 29వ తేదీ వరకు హెచ్‌బీఎఫ్ కొనసాగనుంది. 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని హెచ్‌బీఎఫ్ అధ్యక్షుడు డా.యాకూబ్ షేక్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్ల పుస్తకాలను ప్రదర్శించనున్నామని చెప్పారు. బుధవారం ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో హెచ్‌బీఎఫ్ […]
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. బుధవారం ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు డ్రాగా ముగియగానే మీడియా ముందుకు వచ్చి అశ్విన్.. తాను క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో మెల్బోర్న్, సిడ్నీ టెస్టులు ఉన్నా.. యాష్ అనుహ్యంగా రిటైర్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే సిరీస్ మధ్యలోనే అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడానికి ఆ ఇద్దరే కారణమని చెప్పొచ్చు. సిరీస్ మధ్యలోనే […]
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని దోంగతనం చేసి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు ఉండకుండా ఉండదని టీడీపీ నేత, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. బియ్యం దొంగతనం జరిగిందని పేర్ని నాని ఒప్పుకున్నారని, మాయమైన బియ్యానికి ఆయన సమాధానం చెప్పాలన్నారు. పేర్ని నాని కుటుంబ సభ్యులను కూటమి నేతలు దాచారనే ప్రచారం సరికాదని, పేర్ని నానిని దాయాల్సిన అవసరం తమకు లేదని నారాయణరావు పేర్కొన్నారు. ‘పేర్ని నాని దోంగతనం చేసి డబ్బులు […]
నగర పాలక సంస్థ, ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసి నిర్వహించనున్న ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంకు) ఇతర కార్పొరేషన్లకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డా.పి.నారాయణ అన్నారు. ఈరోజు స్థానిక క్వారీ సెంటర్ రైతు బజారు ప్రక్కన కోటి 95 లక్షల 85 వేల రూపాయలతో నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంకు)ను మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, […]
కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉందని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. పూర్తి మెజార్టీ లేకపోయినా.. రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనం అని మండిపడ్డారు. అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం […]
21 నుంచి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం: విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణ కార్యక్రమంకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 21 నుంచి 25 వరకు భవానీ దీక్షలు విరమణలు జరగనున్నాయి. దీక్షలు విరమణల ఏర్పాట్లపై నేడు ఇంద్రాకిలాద్రిపై సమీక్ష జరగగా.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జాన్ చంద్ర, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గగుడి ఈవో రామారావు పాల్గొన్నారు. ఈసారి 60 లక్షల మంది […]