ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు రాష్ట్రంలో పర్యటించనున్నారు. విజయవాడలోని పెనమలూరులో సీఎం చంద్రబాబు పర్యటించనుండగా.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించనున్నారు. సీఎం పెనమలూరులో ధాన్యం కొనుగోలు సెంటర్ పరిశీలించి.. రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం రెవెన్యూ సదస్సులో పాల్గొని అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గన్నవరం నుంచి ఉదయం 9.30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. విశాఖ […]
‘కలెక్షన్ కింగ్’ మోహన్ బాబు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. తనపై నమోదైన కేసు దృష్ట్యా బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించిన మోహన్ బాబు.. ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. డిసెంబర్ 16న హైదరాబాద్ నుంచి చంద్రగిరికి మోహన్ బాబు చేరుకున్నారు. బుధవారం (డిసెంబర్ 18) సాయంత్రం శ్రీ విద్యానికేతన్ నుంచి ఆయన వెళ్లిపోయారు. కలెక్షన్ కింగ్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జల్పల్లిలో ఉన్న తన నివాసంలో జర్నలిస్ట్‌పై దాడి ఘటనకు […]
నేడు విజయ డైరీ పాలకవర్గ సమావేశం నంద్యాలలో జరగనుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల, విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి మధ్య వివాదం నేపథ్యంలో పోలీస్ బందోబస్తు మధ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పోలీస్ భద్రత కల్పించాలని చైర్మన్ ఎస్వీ జగన్, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డిలు గురువారం నంద్యాల ఎస్పీని కోరారు. శుక్రవారం సందర్భంగా శ్రీశైలంలో శ్రీభ్రమరాంబికాదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామి అమ్మవారి ఊయలసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. […]
గత కొన్ని నెలలుగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నట్లు గురువారం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికలో జరుగుతాయని ఐసీసీ పేర్కొంది. 2027 వరకు భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీ మ్యాచ్‌లను పాకిస్తాన్ కూడా తటస్థ వేదికలో ఆడనుంది. ‘2024-2027 మధ్యలో భారత్, పాకిస్తాన్ దేశాల్లో జరిగే ఐసీసీ టోర్నీల్లో ఇరు జట్లు […]
తాను పేదలకు అన్యాయం చేసే వ్యక్తిని కాదని, అవినీతి సొమ్ము తినే వ్యక్తిని అస్సలు కాదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. తన రాజకీయ జీవితం జీవితం మొత్తంలో పేదల కోసమె పోరాటం చేశాన్నారు. కొందరు రాజకీయ ప్రత్యర్థులు కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. కార్మికుల పక్షాన పోరాటం చేసి వారికి న్యాయం జరిగేలా చేస్తానని కొండా మురళి చెప్ప్పుకొచ్చారు. అజంజాహీ మిల్స్ యూనియన్ కార్యాలయ స్థలం కబ్జా ఆరోపణలపై కొండా మురళి స్పందిస్తూ పై […]
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఆందోళనలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఈ ధర్నా చేస్తోంది. అంబేద్కర్ తమకు దేవుడు లెక్క అని, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. Also […]
శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య వాడీవేడి సంభాషణ జరిగింది. క్వశ్చన్ అవర్‌లో ఒక మంత్రి.. మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే.. ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. అందుకు కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. హరీశ్ రావు బీఆర్ఎస్కు డిప్యూటీ లీడరా?, ఎమ్మెల్యేనా?.. ఏ హోదాతో మాట్లాడుతున్నారు?, ఆయనకు ప్రశ్నించే హక్కు లేదన్నారు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం తెలంగాణ ప్రజలను అవమానపరచడమే […]
సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ తెలిపారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి కొడంగల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు కూడా ప్రారంభిస్తున్నామన్నారు. ఆరోగ్య రంగానికి సంబంధించి శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ ఏడాది 8 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించామని మంత్రి గుర్తు చేశారు. ఒక్కో […]
జగిత్యాల సబ్ జైలులోని ఓ ఖైదీ గుండెపోటుతో మృతి చెందాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశంకు బుధవారం మధ్యాహ్నం గుండె నొప్పి వచ్చింది. సబ్ జైల్ నుండి హుటాహుటిన అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. నిన్నటి నుంచి చికిత్స పొందుతున్న మల్లేశం ఆసుపత్రిలోనే ఈరోజు కన్నుమూశాడు. Also Read: Peddapur Gurukul School: పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో […]
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న బోడ యశ్వంత్‌ను పాముకాటేసింది. స్కూల్ ప్రిన్సిపల్.. యశ్వంత్‌ను హుటాహుటిన కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. బుధవారం అదే పాఠశాలలో ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని పాము కాటేసింది. తాజా ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్ ఈరోజు నిద్ర లేచేసరికి కాలుకు గాయమై.. దురదలు వచ్చాయి. అతడు విషయాన్ని […]