భారతదేశంలో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుందన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో ఓసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. ఇటీవల పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (డిసెంబర్ 23) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,450గా ఉంది. Also […]
మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం నేపథ్యంలో కుర్చీ వివాదంపై కడప నగరం మొత్తంలో ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. ‘హూ ఈజ్ జయశ్రీ’, ‘మహిళలు అంటే చిన్న చూపా’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సర్వసభ్య సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి సీటు వేయకుండా నిలబెట్టడంపై ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఒక మహిళ ఎమ్మెల్యేకు గౌరవం లేదా, జయశ్రీ పేరు మీద రెండు ఫ్లోర్లకు అనుమతి తీసుకొని నాలుగు ఫ్లోర్ కట్టారు అంటూ ఫ్లెక్సీలు కట్టారు. కార్పోరేషన్ కార్యాలయం […]
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డిసెంబర్ 19న హోమ్ డెలివరీ అయిన డెడ్ బాడీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి శ్రీధర్ వర్మ అని పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్ అందుకున్న సాగి తులసి చెల్లెలి భర్తే ఈ శ్రీధర్ వర్మ. నిందితుడు చిక్కితే కేసులో చిక్కుముడులు వీడే అవకాశాలు ఉన్నాయి. కేసులు త్వరగా చేదించేందుకు ఉండి పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలు […]
పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ రేపటికి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు 4 రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. […]
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో వేదికపైన ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేసే అంశం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. గత మున్సిపల్ సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవికి కుర్చీ వేయలేదని ఆమె నిలబడి ప్రసంగించారు. ఈ క్రమంలో మున్సిపల్ మేయర్ సురేష్ బాబుపై ఆరోపణల వర్షం కురిపించారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. వాయిదా పడ్డ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాన్ని నేడు నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 7వ తేదీన జరిగిన మున్సిపల్ […]
ఇన్నాళ్లూ రాకెట్ పట్టి మైదానంలో ప్రత్యర్థులను హడలెత్తించిన భారత స్టార్ పీవీ సింధు.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో సింధు వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్లో ఆదివారం రాత్రి 11.20కి మూడుముళ్ల బంధంతో సింధు, సాయి ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథులు మాత్రమే హాజరయ్యారు. కొత్త జంటకు ప్రముఖులు, ఫాన్స్, నెటిజన్లు […]
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై అనిశ్చితి వీడిన విషయం తెలిసిందే. బీసీసీఐ కోరిక మేరకు హైబ్రిడ్ మోడల్లోనే టోర్నీ జరిపేందుకు పీసీబీ అంగీకరించింది. అయితే పీసీబీ కోరినట్లుగా 2024-27 మధ్య ఐసీసీ ఈవెంట్లలో ఇండో, పాక్ మ్యాచ్‌లు.. భారత్ లేదా పాకిస్థాన్‌లో ఎక్కడ జరిగినా తటస్థ వేదికలోనే నిర్వహిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించబోమని ఐసీసీకి బీసీసీఐ తేల్చిచెప్పడంతో.. పీసీబీ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు సిద్దమైంది. Also Read: IND vs WI: మెరిసిన […]
వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న భారత మహిళా జట్టు.. మూడు వన్డేల సిరీస్‌లోనూ బోణీ కొట్టింది. వదోదర వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో 211 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. 315 పరుగుల ఛేదనలో విండీస్ 26.2 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది. అఫీ ఫ్లెచర్ (24) టాప్ స్కోరర్. భారత బౌలర్ రేణుక సింగ్ (5/29) ఐదు వికెట్స్ పడగొట్టింది. రేణుకకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు […]
‘గేమ్ ఛేంజర్’ సినిమా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు అని గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. తన నుంచి సోలో ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోందని, గేమ్ ఛేంజర్ తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని పేర్కొన్నారు. డైరెక్టర్ ఎస్ శంకర్ ‘కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని, ఆయనతో పని చేయడం తన అదృష్టం అని చెప్పారు. టాప్ డైరెక్టర్ సుకుమార్ గారు ఈ ఈవెంట్‌కు వచ్చి మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని రామ్ చరణ్ […]
ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’పై స్టార్ దర్శకుడు సుకుమార్ తన రివ్యూ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ ఫస్ట్ హాఫ్ అద్భుతం అని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ అని, సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కు గూస్ బంప్స్ వస్తాయన్నారు. క్లైమాక్స్‌లో చరణ్ నటనకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని తాను అనుకుంటున్నా అని సుక్కు పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికాలో నేడు అట్టహాసంగా జరిగింది. ఈవెంట్లో […]