ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’పై స్టార్ దర్శకుడు సుకుమార్ తన రివ్యూ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ ఫస్ట్ హాఫ్ అద్భుతం అని, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ అని, సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌కు గూస్ బంప్స్ వస్తాయన్నారు. క్లైమాక్స్‌లో చరణ్ నటనకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని తాను అనుకుంటున్నా అని సుక్కు పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ అమెరికాలో నేడు అట్టహాసంగా జరిగింది. ఈవెంట్‌లో పాల్గొన్న లెక్కల మాస్టారు పై వ్యాఖ్యలు చేశారు.
‘ఓవర్సీస్ ఆడియెన్స్ తెలుగు సినిమాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు. నేనొక్కడినే సినిమాని ఓవర్సీస్ ఆడియెన్స్ ఆదరించి ఉండకపోతే.. నేను ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు. దిల్ రాజు గారు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. నేను శంకర్ గారి చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్నాను. అప్పుడు చాలా ఆనందం వేసింది. మెగాస్టార్ చిరంజీవి గారు శంకర్ గారితో ఎందుకు సినిమా చేయలేదు, శంకర్ గారు ఎందుకు తెలుగు సినిమా చేయడం లేదు? అని అనుకునే వాళ్లం. అయితే శంకర్ గారితో చరణ్ సినిమా అని తెలిసి తెగ ఆనందపడ్డాను. ఈ విషయాన్ని చరణ్ నాకే మొదటగా చేపడనుకుంటున్నా’ అని సుకుమార్ చెప్పారు.
Also Read: Sandhya Theatre Incident: బాధిత కుటుంబాన్ని పరామర్శించా.. పబ్లిసిటీ చేయలేదు: జగపతి బాబు
‘ఎస్.జే. సూర్య తీసిన ఖుషి సినిమా నాకు చాలా ఇష్టం. రైటర్‌గా వచ్చి డైరెక్టర్‌గా చేశాను. ఖుషి సినిమాను రిఫరెన్సుగా పెట్టుకున్నా. అంజలి మా ఊరమ్మాయి. చాలా బాగా నటించారు. నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమన్ సాయం చేశాడు కానీ.. దాన్ని నేను వాడుకోలేకపోయాను. సినిమా చేసేటప్పుడు నేను ప్రతి హీరోను ప్రేమిస్తా. ఆ సినిమా చేసేటప్పుడు మా అనుబంధం 1-2 ఏళ్లు ఉంటుంది. కానీ రంగస్థలం అయిపోయాక కూడా చరణ్‌తో మాత్రమే నా అనుబంధం కొనసాగింది. చిరంజీవి గారితో కలిస్ గేమ్ చేంజర్ చూశాను. ఫస్ట్ హాఫ్ అద్భుతం, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్, సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్ పక్కా. శంకర్‌గారి సినిమాలు జెంటిల్‌మెన్, భారతీయుడు చిత్రాలను ఎంతగా ఎంజాయ్ చేశానో.. గేమ్ ఛేంజర్‌ను అంతే ఎంజాయ్ చేశాను. రంగస్థలంలో చరణ్ నటనకు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాను కానీ.. రాలేదు. గేమ్ చేంజర్ క్లైమాక్స్‌లో చరణ్ నటనకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంది’ అని సుకుమార్ పేర్కొన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ‘గేమ్ ఛేంజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.