తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 17 నుంచి 24 వరకు సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాల్లో సీఎం పర్యటించనున్నారు. సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనల్లో పాల్గొననున్నారు. గురువారం రాత్రి 10 గంటలకు ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి బృందం సింగపూర్‌కు బయలుదేరుతుంది. 17, 18, 19 తేదీల్లో సింగపూర్‌లో మూడు రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో […]
ఖమ్మం పత్తి మార్కెట్లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 400 పత్తి బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. సంక్రాంతికి ముందు కొందరు వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తి అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఈ ఘటనపై రాత్రే స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. నేడు ఖమ్మం మార్కెట్‌ను పరిలిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రి పత్తి కాలిపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఖమ్మం మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా అని […]
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయంలో కేటీఆర్‌ను అధికారులు విచారిస్తున్నారు. గంట నుంచి విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా కేటీఆర్ నుంచి కీలక సమాచారంను ఈడీ అధికారులు రాబడుతున్నారు. నిధుల బదలాయింపు పైనే ఈడీ ఫోకస్ పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లించారన్న దానిపైనే ఈడీ ప్రశ్నలు సంధిస్తోంది. […]
ప్రస్తుత రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువ కాపాడిన గొప్ప నాయకుడు అని, తెలంగాణ రాష్ట్ర సాకారం చేయడంలో జైపాల్ రెడ్డి పాత్రను మర్చిపోలేమన్నారు. ఇవాళ హైదరాబాద్ అంతర్జాతీయంగా గుర్తింపు రావడానికి, మెట్రో రైల్ రావడంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకం అని జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైనదని ఎమ్మెల్యే వినోద్ కుమార్ […]
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌కు భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఈడీ ఆఫీస్ ముందు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో […]
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి గురువారం ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్.. నేరుగా బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు 10.30కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు కార్యాలయం వద్ద మోహరించారు. హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై […]
సంక్రాంతి పండగ పురస్కరించుకొని ఐదు రోజుల సెలవు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పునః ప్రారంభమైంది. వరుస సెలవుల అనంతరం మార్కెట్ యార్డు తెరుచుకోవండతో.. తమ పంటలను విక్రయించేందుకు రైతులు భారీగా తరలివచ్చారు. వేల సంఖ్యలో పత్తి, మిర్చి బస్తాలతో మార్కెట్ కళకళలాడుతోంది. ముఖ్యంగా తెల్ల బంగారం భారీగా వచ్చింది. రైతులు భారీగా తరలిరావడంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రోజు ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సుమారు 5,000 బస్తాల మిర్చి […]
నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గుర్రంపోడు మండలం ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్.. అనధికారికంగా విధులకు గైహాజరైన సిబ్బందిని సస్పెండ్ చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఫార్మాసిస్ట్, ల్యాబ్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్‌ను ఉద్యోగాల నుంచి తొలగించారు. అలానే ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. డాక్టర్లు, సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం […]
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్దిసేపట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరుకానున్నారు. ఈడీ విచారణకు ఈ నెల 7న హాజరుకావాల్సి ఉన్నా.. తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఓవైపు ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో […]
గత ఏడాది స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేలవ ప్రదర్శన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. టీమిండియా పర్యటనల్లో క్రికెటర్ల కుటుంబ సభ్యుల బసపై బీసీసీఐ ఆంక్షలు విధించనుంది. విదేశీ పర్యటనల్లో కుటుంబ సభ్యులతో ప్లేయర్ వెచ్చించే సమయం, ప్రయాణాల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. బీసీసీఐ నిబంధనలు అమల్లోకి వస్తే.. 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ […]