Minister Anitha: వైసీపీకి ప్రజలు చెప్పిన సమాధానం చాలా ఎక్కువగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ బాధ్యతారహితమైన ప్రతి పక్షంగా తయారైంది.. చిన్న పిల్లలతో రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారు.. మేక తలలు నరికి రక్తాభిషేకాలు చేయిస్తూ నేర ప్రవృత్తిని పెంపొందిస్తున్నారని మండిపడింది. లా అండ్ ఆర్డర్ కాపాడడం పోలీసులకు ఒక ఎత్తైతే.. రౌడీ మూకలను కంట్రోల్ చేయటం సవాలుగా మారిందని పేర్కొనింది. పీపీపీ విధానంలో భాగస్వామ్యమైన వారిని అరెస్టు చేస్తామని జగన్ వార్నింగ్ ఇవ్వడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారు.. రాబోయే ఎన్నికల్లో కూడా వారికి మళ్లీ బుద్ధి చెప్తారని మంత్రి అనిత వెల్లడించింది.
Read Also: NTRNeel : ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ కు తల్లిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్?
అయితే, గతంలో గంజాయి హబ్ గా ఉన్న ఏపీని.. ఇప్పుడు గంజాయి రహితంగా మార్చేందుకు ఈగల్ టీం ఏర్పాటు చేశామని మంత్రి వంగలపూడి అనిత తెలిపింది. గంజాయి వద్దని గత ప్రభుత్వంలో ఏ ఒక్క కార్యక్రమానికైనా జగన్ హాజరయ్యారా అని ప్రశ్నించింది. గంజాయి సాగుని జీరోకి తీసుకు వచ్చాం.. ఎవరైనా గంజాయి రవాణా చేస్తే పట్టుకొని కేసులు పెడుతున్నాం.. రౌడీమూకల ఆటలను కూడా కట్టడి చేస్తాం.. వైసీపీ నాయకులపై ఎవరిపైనా మేము కక్షలు పెట్టుకోలేదు.. మేం కక్ష సాధింపుకు పాల్పడితే వైసీపీ నాయకులు రోడ్డుపై తిరుగుతారా అని క్వశ్చన్ చేసింది. బాధ్యతాయుతంగా పని చేస్తున్నాం.. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని మంత్రి అనిత ఆరోపించింది.