సెక్రటేరియట్లో మంత్రి సీతక్కతో క్రిస్ప్ థింక్ ట్యాంక్ సంస్థ మెంబర్ సెక్రటరీ, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ఆర్.సుబ్రమణ్యం భేటీ అయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్య, వైద్య వ్యవస్థలు, మహిళా సాధికారతల బలోపేతంపై చర్చ జరిగింది. పేదరిక నిర్మూలన, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు క్రిస్ప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. క్రిస్ప్ తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి సీతక్క సమక్షంలో క్రిస్ప్ మెంబర్ సెక్రటరీ […]
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే చారిత్రాత్మకం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 97 శాతం ప్రజలు సర్వేలో పాల్గోన్నారని, కొంత మంది ఇది సర్వేనే కాదని మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఓటర్ల జాబితాతో సర్వేను పోల్చడం సరికాదన్నారు. ప్రభుత్వ సర్వేలో కొంతమంది పెద్దలు పాల్గొనకపోవడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని గుత్తా ప్రభుత్వాన్ని కోరారు. మీడియా సమావేశంలో శాసనమండలి […]
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు వరంగల్‌కు రానున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సాయంత్రం 5 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో హనుమకొండకు సాయంత్రం 5.30 గంటలకు చేరుకోనున్నారు. ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కాంగ్రెస్ శ్రేణులు హెలిపాడ్ సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం 6.15కి సుప్రభ హోటల్లో కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్న రాహుల్ గాంధీ.. అనంతరం ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. Also Read: Gold Rate Today: నేడు […]
ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకాన్ని ప్రకటించిన అనంతరం ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా భారతదేశంలో గోల్డ్ రేట్ రికార్డ్ స్థాయికి చేరింది. అయినా కూడా బంగారం ధరలో పెరుగుదల ఆగడం లేదు. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350 పెరగగా.. నేడు రూ.800 పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై వరుసగా రూ.390, రూ.870 పెరిగింది. బులియన్ […]
గచ్చిబౌలిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. నానాక్ రామ్ గూడ వద్ద 41 గ్రాముల బ్రౌన్ హెరాయిన్‌ను శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేసింది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లను సీజ్ చేశారు. బంగ్లాదేశ్ నుండి హైదరాబాద్ నగరంకు హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ టీమ్ గుర్తించింది. Also Read: Tiger Roaming: కాటారంలో పెద్దపులి సంచారం కలకలం.. భయాందోళనలలో ప్రజలు! […]
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లి అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మహదేవ పూర్ రేంజ్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. పలుచోట్ల పెద్దపులి అడుగులు కనిపించడంతో ప్రజలు భయాందోళనల వ్యక్తం చేస్తున్నారు. నస్తూరుపల్లి గ్రామానికి చెందిన వెంకటి అనే వ్యక్తి తన పశువుల కోసం అడవిలోకి వెళ్లి వస్తుండగా.. మహదేవపూర్ దిశగా వెళ్తున్న పెద్దపులి కనిపించిందని స్థానికులు అంటున్నారు. మహదేవపూర్ పరిసరాల్లో పెద్దపులి కనిపించిందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం […]
చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధానార్చకులు సీఎస్ రంగరాజన్ గారిపై జరిగిన దాడి ఘటనను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. రాజధాని ఢిల్లీ నుండి రంగరాజన్ గారికి ఫోన్ చేసి ఈటల పరామర్శించారు. దాడి ఘటన వివరాలను బీజేపీ ఎంపీ అడిగి తెలుసుకున్నారు. రంగరాజన్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన మీద దాడి చేసిన వారిపై లోతైన దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ హిందూ […]
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ దివాన్‌దేవిడిలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. రూ.60-100 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. దాదాపు 400 బట్టల దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు నిర్ధారణ అయింది. ఒక్కరోజు తర్వాత ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగింది. దాదాపు 20 ఫైర్ ఇంజన్లతో 24 గంటల పాటు మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించింది. Also Read: Jasprit Bumrah: […]
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ జట్టుతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బరిలో దిగుతాడా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. మెగా టోర్నీలో బుమ్రా ఆడడంపై బీసీసీఐ మంగళవారం తుది నిర్ణయం తీసుకోనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేర్పులకు నేటితో గడువు ముగుస్తుండంతో.. బుమ్రాపై ఏదో ఒక నిర్ణయం […]
తెలంగాణ రాష్ట్రంలోని బీర్ ప్రియులకు భారీ షాక్. రాష్ట్రంలో బీర్ల ధరలను ప్రభుత్వం సవరించింది. బీర్ల ధరలపై 15 శాతం పెంచుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ 15 శాతం ధరల పెంపును సిఫారసు చేసింది. కమిటీ సిఫారసు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఈరోజు (ఫిబ్రవరి 11) నుంచి అమల్లోకి రానున్నాయి. అన్ని రకాల బీర్ బ్రాండ్లపై […]