తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే చారిత్రాత్మకం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 97 శాతం ప్రజలు సర్వేలో పాల్గోన్నారని, కొంత మంది ఇది సర్వేనే కాదని మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఓటర్ల జాబితాతో సర్వేను పోల్చడం సరికాదన్నారు. ప్రభుత్వ సర్వేలో కొంతమంది పెద్దలు పాల్గొనకపోవడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని గుత్తా ప్రభుత్వాన్ని కోరారు.
మీడియా సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే చారిత్రాత్మకం. 97 శాతం ప్రజలు సర్వేలో పాల్గోన్నారు. కొంత మంది ఇది సర్వేనే కాదని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓటర్ల జాబితాతో సర్వేను పోల్చడం సరికాదు. ఓటర్ల నమోదులో డూప్లికేషన్ కొనసాగుతుంది. దాని వల్ల లెక్క తేడా వస్తుంది. 2014లో నాటి ప్రభుత్వం చేపట్టిన సర్వే అధికారికంగా ప్రవేశ పెట్టలేదు. ప్రతీ అంశాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం సరైంది కాదు’ అని అన్నారు.
Also Read: Rahul Gandhi: నేడు వరంగల్‌కు రాహుల్ గాంధీ.. పార్టీ శ్రేణులతో భేటీ!
‘ప్రభుత్వ సర్వేలో కొంతమంది పెద్దలు పాల్గొనకపోవడం కరెక్ట్ కాదు. రేషన్ కార్డుల్లో గతంలో ఉన్నట్టు ఏపీఎల్, బీపీఎల్ కార్డులు మంజూరు చేయాలి. వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. కులాల మధ్య విద్వేషం నింపేలా ప్రజా ప్రతినిదులు మాట్లాడడం కరెక్ట్ కాదు. తాత్కాలిక ఉద్వేగాలతో మాట్లాడితే దీర్ఘకాలంలో వారికే నష్టం’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.