‘జాతీయ సైన్స్‌డే’ సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్‌కు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఓపెన్ టాప్ జీపులో స్టేడియంలో ఉన్న స్కూల్ అండ్ కాలేజ్ విద్యార్థులందరికీ కేంద్రమంత్రి, సీఎం అభివాదం చేశారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సర్ సీవీ రామన్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డీఆర్డీవో, డిఫెన్స్, ఏరోస్పేస్ ఉత్పత్తులకు చెందిన 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. విజ్ఞాన్ […]
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు ఇటీవల జైలు నుండి విడుదలైన ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీశ్ రావు, వంశీ కృష్ణ, సంతోష్ కుమార్, పర్శరాములుపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో ఏ-2గా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ […]
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 9 పేజీల బహిరంగ లేఖ రాశారు. కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తులను సీఎం లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. బెంగళూరు, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కీలక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతుల కోసం రాష్ట్రం ఎదురుచూస్తోందని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి […]
ఎస్ఎల్బీసీ టన్నెల్‌ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్ పనులు చేశాం అని హరీశ్ రావు అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కిమీ ఎందుకు తవ్వలేక పోయారన్నారు. హరీశ్ రావు సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడని ఎద్దేవా చేశారు. అడిగిన దానికి తప్ప.. అన్నిటికి హరీశ్ రావు స్పందిస్తారని విమర్శించారు. ప్రమాదం జరగగానే హరీష్ రావు ఎందుకు రాలేదు? […]
తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. లబ్ధిదారుల వివరాలు గ్రామాల్లో ప్రదర్శించండని సూచించారు. శుక్రవారం ఉదయం ప్రజాభవన్‌లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామ కృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపీలతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా పథకంలో భాగంగా మూడు ఎకరాల వరకు […]
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ కార్మికులు సొంతూర్లకి పయనమవుతున్నారు. ఇటీవలి రోజుల్లో టన్నెల్లో ప్రమాదం చోటుచేసుకోవడంతో తమ కుటుంబ సభ్యులు భయపడుతున్నారని అధికారులకు కార్మికులు చెబుతున్నారు. టన్నెల్లో పని చేయాలంటే భయంగా ఉందని, పనులు ముందుకు సాగుతాయో లేదో అని కార్మికులు అంటున్నారు. జార్ఖండ్, బీహార్, యూపీ, హర్యానాలకు కొందరు ఎస్ఎల్బీసీ కార్మికులు బయల్దేరారు. ఇటీవల జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దాదాపుగా […]
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటీఏ)లో 24వ బ్యాచ్ కెనైన్స్ (డాగ్ స్క్వాడ్) పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్‌కు ముఖ్యఅతిథిగా ఇంటలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. డీజీకి ఓ జాగిలం పూలబొకే ఇచ్చి స్వాగతం పలికి.. సెల్యూట్ చేసింది. అనంతరం డీజీ జాగిలాలను పరిశీలించి.. గౌరవ వందనం స్వీకరించారు. ఐఐటీఏలో 24వ బ్యాచ్ కెనైన్స్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో 72 జాగిలాలు పాల్గొన్నాయి. ఈ 72 […]
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి వచ్చారు. సాదాసీదాగా రైల్లో ఢిల్లీ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. స్టేషన్లో మీనాక్షి నటరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన వెంట హర్కర వేణుగోపాల్, ఫహీం, రచమల్ల సిద్దేశ్వర్ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఏఐసీసీ కార్యదర్శి గాంధీభవన్‌కు చేరుకున్నారు. గాంధీభవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం […]
కుల గణన సర్వే నేటితో ముగియనుందని.. ఇంకా సర్వేలో పాల్గొనని వారు, ఎన్యుమారెటర్లకు వివరాలు ఇవ్వని వారు వెంటనే సర్వేలో పాల్గొనాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జనాభా లెక్కల్లో మీ భాగస్వామ్యం ఉండాలంటే కుల గణన సర్వేలో పాల్గొనాలని కోరారు. ఎక్కడెక్కడ ఇంకా కుల సర్వేలో పాల్గొనలేదో.. అక్కడ కుల సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, ఫ్రొఫెసర్లు వారికి అవగాహన కల్పించాలని మంత్రి […]
నేటి నుంచి వరంగల్ నిట్‌లో ‘స్ప్రింగ్ స్ప్రీ 25’ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు (మార్చి రెండవ తేదీ వరకు) వసంతోత్సవాలు కొనసాగనున్నాయి. వసంతోత్సవాలను ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రారంభించనున్నారు. ఈ కల్చరల్ ఫెస్ట్ పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొననున్నారు. స్ప్రింగ్ స్ప్రీ 25 కోసం విద్యార్థులు వరంగల్ నిట్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం నిట్ కళకళలాడుతోంది. వరంగల్ నిట్‌లో ప్రతీ ఏడాది విద్యార్థులే నిర్వాహకులుగా మూడు రోజులు వసంతోత్సవాలను నిర్వహించనున్నారు. […]