Jupally Krishna Rao: అడిగిన దానికి తప్ప.. అన్నింటికీ హరీశ్ రావు స్పందిస్తారు!
- ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు?
- హరీశ్ రావు సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడు
- రాజకీయ లబ్ధి కోసం డ్రామా చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదు? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్ పనులు చేశాం అని హరీశ్ రావు అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కిమీ ఎందుకు తవ్వలేక పోయారన్నారు. హరీశ్ రావు సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడని ఎద్దేవా చేశారు. అడిగిన దానికి తప్ప.. అన్నిటికి హరీశ్ రావు స్పందిస్తారని విమర్శించారు. ప్రమాదం జరగగానే హరీష్ రావు ఎందుకు రాలేదు? అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు.
‘ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కి హరీష్ రావు వంద వాహనాల్లో యుద్ధానికి వెళ్లినట్టు వచ్చారు. అడిగిన దానికి తప్ప.. అన్నింటికీ ఆయన స్పందిస్తారు. 2014 నుండి 2023 వరకు 200 కిలోమీటర్ల టన్నెల్ పనులు చేశాం అంటున్నారు, పదేళ్లలో మిగిలిన 19 కిమీ ఎందుకు తవ్వలేకపోయారు. డబ్బులు లేక తవ్వలేదా ఎస్‌ఎల్‌బీసీ లేదా.. కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని తవ్వలేదా?. హరీష్ సొల్లు పురాణం మాటలు మస్తు చెప్తాడు. ప్రమాదం జరగగానే హరీష్ ఎందుకు రాలేదు. నేను ఒక్కడినే టన్నెల్ లోపలికి వెళ్ళాను. టన్నెల్‌లోకి వాటర్, బురద వచ్చి ముసుకుని పోయింది. అది తీస్తే మరలా వరద వస్తది కదా. 8 మందిని తీయడానికి 100 మంది లోపలికి పోయారు. బురద, నీళ్లు వస్తున్నప్పుడు మళ్ళీ ప్రమాదం జరిగితే.. ఇంకో ఘటన జరుగుతుంది కదా?. జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. జాతీయ సంస్థలు అన్నీ వచ్చాయి, ఆ సంస్థలు చెప్పినట్టు చేస్తున్నాం’ అని మంత్రి జూపల్లి తెలిపారు.
Also Read
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
‘జిల్లా మంత్రిగా నేనే టన్నెల్‌లోకి వెళ్లి వచ్చా. మమ్మల్ని రానివ్వలేదు అని కొందరు డ్రామా చేశారు. రావడానికి అనుమతి ఇచ్చింది మేమే, రాజకీయ లబ్ధి కోసం డ్రామా చేస్తున్నారు. మీరేమైనా అధికారంలో ఉన్నప్పుడు అనుమతి ఇచ్చారా?. వచ్చి చూడాలి అనుకుంటే.. 100 వాహనాల్లో వస్తారా?. పాలమూరు రంగారెడ్డిలో ప్రమాదం జరిగితే కేసీఆర్ వచ్చాడా?.. పవర్ హౌస్ మునిగితే కేసీఆర్ వచ్చాడా?, మంత్రి వచ్చాడా?.. కొండగట్టు ప్రమాదంలో 65 మంది చనిపోతే కేసీఆర్ వెళ్ళాడా?.. కాళేశ్వరం టన్నెల్‌లో ఏడుగురు చనిపోయినపుడు కేసీఆర్, హరీష్ పోయాడా?’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!