ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన చివరి మ్యాచ్‌ను మరికొద్దిసేపట్లో దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. డెవాన్ కాన్వే స్థానంలో డారిల్ మిచెల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు భారత్ కూడా ఓ మార్పు చేసింది. హర్షిత్ రాణా స్థానంలో వరుణ్ చక్రవర్తి ఆడనున్నాడు. 14వ సారి భారత్ టాస్‌ను ఓడిపోవడం విశేషం.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ చేరాయి. ఇందులో గెలిచిన జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఓడిన జట్టు మరో సెమీస్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. కివీస్‌పై గెలిచి.. సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడాలని భారత ఫాన్స్ కోరుకుంటున్నారు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని ఫాన్స్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, షమీ, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), కేల్ జేమీసన్, విలియమ్ ఓరూర్కీ.