పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. గత 4-5 రోజలుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. వరుసగా రెండోరోజు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.110 పెరగగా.. నేడు రూ.440 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.100 పెరగగా.. నేడు రూ.400 పెరిగింది. గురువారం (మార్చి 27) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,840గా.. 22 క్యారెట్ల ధర రూ.82,350గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరోవైపు వెండి ధరలు నేడు ఊరటనిచ్చాయి. వరుసగా మూడు రోజులు స్థిరంగా ఉండి, నిన్న పెరిగిన సిల్వర్ రేట్.. నేటి ధరలో ఎలాంటి మార్పు లేదు. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,02,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 11 వేలుగా ఉంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.1,02,000గా నమోదైంది. బంగారం, వెండి ధరలు ఆయా రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ ధరలు ఈరోజు ఉదయం 10 గంటలకు నమోదయ్యాయి.